Monday, March 8, 2010

లీడర్ ....

స్లో నారేషన్ ఉన్న మైల్డ్ స్టోరీస్ బాగా తెర కెక్కించ గల శేఖర్ కమ్ముల నుండి రాజకీయాలమీద అల్లుకున్న ఒక కధని ఆశించడం.. ఊహించడం పెద్ద కలే..

కానీ లీడర్ చిత్రం అంచనాలను మించి .. కేవలం ఆకట్టుకోవడానికే కాక .. హత్తుకునేట్టు తీసిన .. చేసిన ప్రయత్నం అనిపించింది నాకు..

ముఖ్యంగా రాజకీయ 'నాయకులకులంటే' ప్రజలకు జరగాల్సిన 'న్యాయాన్ని' జరగావలసినట్టు చూసే 'భాద్యతను' వహించవలసిన వారని చెప్పిన విదానం హర్షణీయం...

గొల్లపూడి మారుతీ రావు గారి నటన చాల రోజుల తరువాత చూడడం ఆనందం. ఆయన కనిపించిన సన్నివేశాల్లో మాటలు చాల గొప్పగా పండాయి..

హీరో పరవాలేదు.. హీరోయిన్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.. సుహాసిని గారి నటన ఎప్పటిలా బాగానే ఉంది..కాకుంటే ఎక్కువ సన్నివేశాలలో .. భాదగా ఉండడం కధ యొక్క అవసరం...

సాంకేతిక పరంగా...సంగీతం , నేపధ్య సంగీతం అధ్బుతం.. కెమెరా దర్శకుని ఆదేశాల మేరకు నడిచింది.. మాటలు.. దర్సకత్వం .. కమర్షియల్ గా కన్నా ఆలోచింపజేసేవిగా ఉంటాయి..

గొప్ప చిత్రం...ఇంతకు మించి నేను రాయడానికి ఏమీ లేదు..కాని అందరికీ నచ్చక పోవచ్చు.. మల్టీ ప్లెక్ష్ లో బాగా ఆడగల సినిమా...

చీర్స్ టు శేఖర్...

4 comments:

 1. చిత్రం చివర్లో మా తెలుగు తల్లికీ మల్లెపూదండ పాటను చాలా హృద్యంగా చిత్రీకరించటం నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది.

  ReplyDelete
 2. అవునండీ ... రీమిక్ష్ పాట అయినా పాట అందం చెడకుండా కాపాడగలిగారు.. అలాగే చివర్లో ఒక్కరికి న్యాయం చేయలేక పదవీ విరమణ చేయడం కూడా బాగుంది .. ముఖ్యం గా ఈ సంభాషణ ..

  హీరో : నాకు ఎవ్వరూ లేరు.. మీరు నాతోనే ఉండండి..మిమ్మల్ని బాగా చూస్కుంటాను.. మీ అమ్మాయిని చక్కగా చిదివిస్తాను పెళ్లి చేస్తాను..

  ముసలాయన : క్షమించండి దొర..ఒద్దు ..నాకు నమ్మకం లేదు..

  ..................

  హీరో : చేత కాని వ్యవస్థలో చేత కాని CM..ఇది కాదండి ప్రజలు కోరుకునేది..

  ReplyDelete
 3. మంచి సినిమా ! రెండో భాగంలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నా ...మాతెలుగుతల్లికి , శ్రీలుపొంగిన ..పాటలు పెట్టడం ఆనందించదగ్గ విషయం !

  ReplyDelete
 4. Mulluni mulluthone teeyali ane paatha sametha adharamga... Rajakeeyalani Rajakeeyalatho...
  Corruption ni Currption tho...
  Rajakeeya nayakulaki atheetam ga.. prajala kosam matram cheyabadda anti corruption chattam....

  At least at the lowel level corruption arikadithe, mana desam inka muduku velutundi...

  Concept 1st half plannning 2nd half lo execution lo miss indi anukunna..

  Good thoughts from Sekar...

  Movie thesina antha easy kaadu, country lo corruption stop cheyadam... Praja chaitanyaniki enni movies raaledu???

  Ramki :)

  ReplyDelete