Monday, February 8, 2010

పెద్దగా జనాల్లోకి రాని శంకర్ మహదేవన్ పాట..

చిత్రం : మనసుతో
సంగీతం : ఆశీర్వాద్
గానం: శంకర్ మహదేవన్
రచన ; సుద్దాల అశోక్ తేజ

ఎప్పుడు చప్పుడు కాని కనురెప్పలలొ నువ్వె
చప్పుడు యెప్పుడు ఆపని గుండె చప్పుడు లొ నువ్వె
మాటకు మాటకు మధ్యన నిలిచిన మౌనం లొ నువ్వె
మౌనం మౌనం నడుమున పలికిన మాటలలొ నువ్వె
మాటల వెనుక మౌనం వెనుక మనసులొ నువ్వె
మనుసుతొ నువ్వె ...మనసువై నువ్వె
తక్ తక్ తక్ తక్ తక్ తక్ లబ్ డబ్ లబ్ డబ్ సవ్వడి మధ్యన
చిరు చిరు చిరు చిరు చిరు చిరు
విరామం నువ్వు నువ్వు నువ్వు నువ్వు నువ్వు నువ్వే...
నరాల రక్తహ్ ప్రవాహ విధ్యుత్ ప్రసారమెలా
శరీర జ్వాల చలించి పోదా
వెలసిన చల్లని పున్నమి వెన్నెల తుషారమె నువ్వె
నిన్నె స్మరించి నిన్నె వరించి నీకై తపించి
నీకై జ్వలంచి తడారిపొయిన ఎడారి మాదిరి గుడారమై వుంటే.. .........

.............
.............

.............
.............

.............
.............

.............
.............

ఆన్ లైన్ లో వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.. (నాకు దొరికిన ఓ లింక్ )




6 comments:

మధురవాణి said...

మీ పోస్ట్ టైటిల్ చూడగానే ఎందుకో మీరీ పాట గురించే చెప్తున్నారనిపించిందండీ.. సినిమా భరించడం కష్టం గానీ, ఈ పాట బావుంటుంది :)

శివ చెరువు said...

డిగ్రీ చదువుతున్న రోజుల్లో .. సెలెక్టివ్ గా సాంగ్స్ ఆడియో కేసెట్ రికార్డు చేయించుకుని వినేవాడిని.. ఓ సారి.. నేనేదో పాట అడిగితే (ప్రోమో లో చూసి ఈ సినిమా టైటిల్ సాంగ్) , కేసెట్ లో ప్లేస్ ఉంది అని.. ఈ పాట కూడా రికార్డు చేసేసారు.. అలా తెలిసింది నాకు ఈ పాట గురించి.. తరువాత నెట్ లో ఈ పాట గురించి చాల వెదికాను..

Sujata said...

మీకు శంకర్ మహాదేవన్ 'ఓ సాహెబా' పాట తెలుసా / గుర్తుందా ? ఈ పాట వీడియో లో బుద్ధిస్ట్ చక్రాన్ని ఒక బుల్లి బౌద్ధ సన్యాసి తిప్పుతూ ఆడుకుంటూంటాడు. వీడియో మొత్తం చాలా బావుంటుంది. మీరు శంకర్ అభిమానులయితే, బ్రెథ్లెస్ కాలం నాటి ఈ పాట గురించి తెలిసి ఉంటుందని అడుగుతున్నాను. లింక్ దొరికితే ఇవ్వగలరా ? నేను చాలా ప్రయత్నించాను.

Sujata said...
This comment has been removed by the author.
Sujata said...

శివ గారు..

థాంక్స్ చాలా చాలా.. ఎన్నాళ్ళకి ఈ పాట విన్నానో ! అలానే మీరు నా బ్లాగ్ లో కి వచ్చి కామెంట్ ఇవ్వడం వల్ల మాత్రమే నేను ఇది చూసాను. ఒక వేళ మీ బ్లాగ్ లో కామెంట్ పెట్టుంటే, నేనొ ఎపుడు చూసేదాన్నో / చూసి ఉండేదాన్నే కాదేమో! అందువల్ల మీకు డబల్ థాంక్స్. డౌన్ లోడ్ మాత్రం చేయడం కాలేదు. :(

Anonymous said...

బాబు సంగీతం ఆశీర్వాదా ? ఆయన ఎవరు ?సంగీతం కమలాకర్ (వాన ఫేం (వాన లో కూడా ఎత్తుకొచ్చిన ట్యూన్సే)