Saturday, February 13, 2010

శివ స్మరణం...ఓం నమః శివాయ

శివ స్మరణం బోలెడంత పుణ్యం.. ప్రసాదిస్తుంది..ఈశానః సర్వ విద్యానాం .. ఈశ్వరః సర్వ భూతానాం.. అన్నారు..
ఆయన గురించి తెలుసుకోవడం తప్ప.. అందరిలో .. మనలో ఆయన దర్శనం చేసుకోవడం తప్ప సార్ధకత వేరేమి ఉంటుంది.. అదే కదా ఆనందానికి అసలు అర్ధం కూడా..

భగవంతుని పొగడ తరమా..? ఆయన గొప్ప తనం గూర్చి ఎంత చెప్పినా తక్కువే..ఆదిమధ్యాంత రహితుడు.. అలాగని ఆయన గురించి చెప్పుకోకుండా ఉండలేము మరి.. ఆ ఆధ్యాత్మిక తరంగాల స్పర్శ గురించి చేసే చర్చలో పాల్గొనడమే గొప్ప అదృష్టం.. మాట్లాడి మన అనుభవాలు పంచుకున్నా.. లేక విని కొంత భగవత్ చింతనను సముపార్జిన్చుకొన్నా జీవితం ధన్యమే కదా ...

ఇందులో గొప్ప విషయం ఏంటంటే .. ఈ స్వీయ అన్వేషణలో ఎవరి అనుభవాలు వారివే.. ఒకరికి జరిగిన భగవత్ సాక్షాత్కారాన్ని గూర్చి మనం వారి మాటల్లోనో.. వేరొకరి మాటల్లోనో తెలుసు కోగలమేమో కాని.. దాన్ని మనదిగా అనుభూతి చెందలేము..

"దేవుడు లేని చోటు చూపవయ్యా ?" అన్నారెవరో..మహానుభావులు . ఆ మాట ఎంతో నమ్మకాన్ని.. వెల్లడి చేస్తోంది..!
అయినా సర్వత్రా వ్యాపించి వున్న ఆ స్వామిని లేరని.. పలానా చోట లేరని.. ఎవరు మాత్రం చెప్పగలరు..?

మనము ఏదైతే సుఖానుభూతుల సమూహము గా భావన చేస్తున్నామో ఆ ఇహమును బాహ్యము గా కాక .. అంతర్చక్షువుల ద్వారా చూడాలి.. సౌఖ్యముల కొరకు కాక .. భగవంతుని సాన్నిధ్యము కొరకు .. దర్శించే అన్నిటా సత్ భావన కలుగుటకు ద్యానావస్థను ఆశ్రయించాలి..

సర్వే జనాః సుఖినో భవంతు ..

ఆసక్తి కలవారు ప్రతి రోజూ వచ్చే భక్తి చాన్నెల్ లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చాగంటి కోటేశ్వర రావు గారి వ్యాఖ్యానం శివుని గురించి వినండి...

శివ రాత్రి శుభాకాంక్షలు
శివ కటాక్ష సిద్దిరస్తు

Monday, February 8, 2010

పెద్దగా జనాల్లోకి రాని శంకర్ మహదేవన్ పాట..

చిత్రం : మనసుతో
సంగీతం : ఆశీర్వాద్
గానం: శంకర్ మహదేవన్
రచన ; సుద్దాల అశోక్ తేజ

ఎప్పుడు చప్పుడు కాని కనురెప్పలలొ నువ్వె
చప్పుడు యెప్పుడు ఆపని గుండె చప్పుడు లొ నువ్వె
మాటకు మాటకు మధ్యన నిలిచిన మౌనం లొ నువ్వె
మౌనం మౌనం నడుమున పలికిన మాటలలొ నువ్వె
మాటల వెనుక మౌనం వెనుక మనసులొ నువ్వె
మనుసుతొ నువ్వె ...మనసువై నువ్వె
తక్ తక్ తక్ తక్ తక్ తక్ లబ్ డబ్ లబ్ డబ్ సవ్వడి మధ్యన
చిరు చిరు చిరు చిరు చిరు చిరు
విరామం నువ్వు నువ్వు నువ్వు నువ్వు నువ్వు నువ్వే...
నరాల రక్తహ్ ప్రవాహ విధ్యుత్ ప్రసారమెలా
శరీర జ్వాల చలించి పోదా
వెలసిన చల్లని పున్నమి వెన్నెల తుషారమె నువ్వె
నిన్నె స్మరించి నిన్నె వరించి నీకై తపించి
నీకై జ్వలంచి తడారిపొయిన ఎడారి మాదిరి గుడారమై వుంటే.. .........

.............
.............

.............
.............

.............
.............

.............
.............

ఆన్ లైన్ లో వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.. (నాకు దొరికిన ఓ లింక్ )