Sunday, January 31, 2010

ఆ ఛాయలే నిలుస్తాయి..





చాల కాలమయింది
నాకు, సంతోషానికి ఒక చీలిక ఏర్పడి..

అంతటితో..

చీకటి లో మిగిలి పోయానని
ప్రపంచం
లోకి రావడం మానేసాను ..
ఒక్కడి గా వుండిపోవటం అలవాటు చేసుకున్నాను

విషాదం వానలా కురిసింది
నేనూ తడుస్తూనే వచ్చాను..
నన్ను నేనే బలహీన పరుచుకుంటూ వచ్చాను
చల్లని గాలి స్పర్శకూడా తట్టుకోలేని స్థితికి చేరాను..

నాలో ఎన్నో ప్రశ్నలు.. పోటెత్తనారంభించాయి..
ఉపయోగం లేని సమాధానాలు అక్కడక్కడా మసక మసక గా దర్శనమిచ్చాయి ..

ఇక రేపు లేదోమో అన్న భయం వెంట పడడం మొదలు పెట్టింది
ఎంత దూరం వెళ్ళినా నను వీడక ఉంది..

అలసి పోయాను..
అలసి పోయాను..
ఇక అటూ ఇటూ పరుగులు పెట్టడం మానేసాను..

ఒక్క నిమిషం నన్ను నేను చూసుకున్నాను
అర్ధమయింది ...
ఎంత అర్ధ రాహిత్యమని నా స్థితి !
ఒంటరివాడిననుకొని..
నాతో ఇన్ని జాడ్యాలు జత చేర్చుకున్నానని..

అంతే..!
వెంటనే ఎక్కడి నుండో గొడుగు చేతికి తగిలింది..

అనాలోచితంగా క్షణం ..
నేను, వేదన నుండి.. వేరు కాబడడం గమనించాను

ఇప్పుడు
చేతుల మీదుగా కొత్త చేతలు తీగల్లల్లు కుంటున్నాయి
కావలసిన రంగులు పూస్తున్నాయి..

ఇక ఎప్పటికీ వాడి పోని పూలు వికసిస్తున్నాయి ..
తమ పరిమళాలు వెదచల్లడానికి సిద్దమౌతున్నాయి

స్వేచ్చ యొక్క విజయ కేతనాలు విహంగాలై విహరిస్తాయి..

ఏదో రోజు చీకటి జాడలూ
సమసిపోతాయి..
ఆనందపు తరంగాల సంధి కాలంలో కూడా
పూర్తిగా ఛాయలే నిలుస్తాయి..

6 comments:

చైతన్య said...

బాగుంది :)
నిరాశ నుండి చిగురించిన ఆశ!

ఆ ఫోటో అంత perfect గా ఎలా సరిపోయింది? మీరే క్రేఅతే చేసారా అది?

రమణ said...

చాలా బాగుంది.

శివ చెరువు said...

చైతన్య గారు .. థాంక్స్ అండి..మామూలుగా అయితే మాత్రం ముందు ఏమైనా పోస్ట్ అనుకున్న తరువాత ఫోటో వెదకటం నా అలవాటు.. ఈ ఫోటో దేనికోసమో వెదుకుతుంటే... గూగుల్ లో దొరికింది.. నేను రాసిందంతా ఈ చిత్ర ఆధారితమే.. నేను చదువుతున్న ఓషో విరచిత "ఆనందం" అనే పుస్తకం లో నాకు అర్ధమయినదాన్ని.. ఆ చిత్రానికి అన్వయించాను .. :)

రమణ గారు.. థాంక్స్ అండి..

రాజశేఖరుని విజయ్ శర్మ said...

యద్భావం తద్భవతి. మనం మన చుట్టూ చీకటే ఉంది అనుకున్నంతకాలం వెలుగులో నిలుచున్నా చీకటే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనలో వెలుగు చూడాలన్న కాంక్ష మొదలవుతుందో అప్పుడే ఆవెలుగు కనిపిస్తుంది. కానీ ఆవెలుగు చీకటులు ఎప్పుడూ ఉండేవే. వాటిని చూసే మన స్థితిలోనే తేడా అంతా. బాగా రాశారు.

N. Aditya Madhav said...

:)

sahiti said...

challaaaaaaa bagundi.....:)