Tuesday, January 12, 2010

నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ





ఏటి ఒడ్డున ..
నా బుజాన తల వాల్చి నువ్వు చెప్పే కబుర్లు

నదీ తీరాన..
అడుగులో అడుగు వేస్తూ దాటిన లెక్కలేని దూరాలు

వాలిన చెట్టు అంచులనుంచి మబ్బులను చూపిస్తూ ..
చంద్రుడిని దాచేస్తూ, కాలాన్ని వెలి వేసిన సందర్భాలు

ఏవైనా కానీ..?
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ

ఎదుటే నిలువనీ..
జ్ఞాపకాల గదిలో అడుగు పెట్టనీ...
మనసు మనసు మాట వినదు..
నీ తలపు గడియ.. ఓ ఘడియ అయినా మూసుకోనివ్వదు

7 comments:

  1. worst of the worst

    ReplyDelete
  2. @Anonymous...ఈసారి మరింత బాగా రాయడానికి ప్రయత్నిస్తాను...

    ReplyDelete
  3. ఈ సారి బాగా రాస్తారా ? ప్రయత్నించండి చూద్దాం ..
    నేనేమంటాను అంటే ..... ప్రేమలో ఒక్కో సందర్భానికి ఒక్కో భావం ఉంటుంది .. ఒక నిర్దిష్టమైన అనుభూతి ఉంటుంది
    మేము మీ నుంచి ఏంటో ఆశిస్తాము .. మిమ్మల్ని ఎక్కడికో తీసుకేల్డం అనుకుంటాం .. మీరు రారు ..
    :(

    ReplyDelete
  4. పోస్ట్ టైటిల్ చూడగానే ఒక పాటలోని నాకు బాగా ఇష్టమైన ఈ లైన్స్ గుర్తొచ్చాయి...
    "నీతో చెలిమి చేస్తున్న నిముషాలు
    నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా"

    ReplyDelete
  5. బావుందండీ కవిత.! నాకు మొదటి మూడు వాక్యాలు నచ్చాయి :)

    ReplyDelete
  6. chala bagundi siva garu...
    Good work.. :)

    @anonymous1: let us know whats ur problm so that we can rectify it(may be urs or ours):)

    @anonymous2: neeru cinima dialogulu api emanna rayadaniki prayatninchandi, mi bhavam, mi anu"bhutulento" maaku telustayi kada :)

    ReplyDelete
  7. FEEL CHALA BAGUNDI..

    @anonymous: meeku nacchakapote cheppe vidhanam okatuntundi, telusukondi, ante kani bloggerlanu ila discourage cheyoddu.

    ReplyDelete