Tuesday, January 5, 2010

ఇక్కడే....
మొదలిక్కడే
తుదికి మొదలిక్కడే

తీరని నర మృగాల దప్పికలిక్కడే
బలి పసువులైన నిస్సహాయులిక్కడే

అన్నార్తుల..
శరణార్థుల.. శిబిరాల శిదిలాలిక్కడే

అక్కరకు రారని..
అక్కున చేర్చుకోని.. అభాగ్యుల భాగ్యమిక్కడే..

ఇక్కడే...
ఇక్కడే....

నెత్తురుడికి
తిమిరాలు తొలగేలా
నరాలు తెగేలా ప్రతిగటించిందిక్కడే
స్వేదపు బిందువుల సంతకాలు పడిందిక్కడే

మొదలిక్కడే
మొదలుకు తుది ఇక్కడే

ఆ కలలకు మొట్టమొదటి మజిలీ ఇక్కడే
ఆశలు ఆశగా బయలుదేరేదీ ఇక్కడే

శోకతప్త హృదయాలకు ఊరట దొరికేదిక్కడే
చరిత్ర పునరావృతమయ్యేదీ ఇక్కడే

దూరపు హద్దులు చెరిపే దిశగా
గమ్యం గడి తప్పనీయని తెరచాపలు లేచేదీ ఇక్కడే

ఇక్కడే...
ఇక్కడే....

13 comments:

రాజశేఖరుని విజయ్ శర్మ said...

ఆలోచింప చేసే విధంగా ఉంది. కవిత చాల బాగుంది.

రాజశేఖరుని విజయ్ శర్మ said...
This comment has been removed by the author.
Anonymous said...

intaki emudo cheppaledu akkada

కెక్యూబ్ వర్మ said...

బాగుంది. మీ కవిత ఆర్థ్రత కట్టిపడేసింది.థాంక్యు

బొల్లోజు బాబా said...

WONDERFUL

@ANONYMOUS

YEMUNDAA?

JEENA YAHAA MARNA YAHAA.....

ISNT IT?

చైతన్య said...

Good one! thought provoking

Anonymous said...

maa telangana vollante gatlane untadile meeku mammalni edavalni chestaru meeru haayiga untaaru

Nayani Aditya Madhav said...

Very nice one!
Excellent, thers a spark in it. good work

@anonymous1:
Did u read the post or just commenting. Read it once and think of it then you will get the answer.

@anonymous2:
we are also born in Telangana boss, this post is not at all concerned with any of the disturbances prevailed over the state, just try to understand the essence of it. We all are equal as children of Mother India.

శివ చెరువు said...

@ విజయ్ గారు .. ధన్య వాదాలండి. ఏదో చెప్పలనుకుని ఆగినట్టున్నారు..?

@ Anonymousగారు .. ..చరిత్రలో మంచీ చెడూ పునరావ్రుతమవుతూ ఉంటాయి.. అలాగే ఒకదానితో ఒకటి సమకాలీనమై ఉంటాయి..చెడు రాజ్యమేలేదీ ఇక్కడే .. మంచి విజయ గర్వాన్ని పొందేదీ ఇక్కడే.. కాకుంటే ఈ మధ్యలో ఎంతో వేదన ..వీటికి మొదలూ ఇక్కడే ... చివరా ఇక్కడే..

@కెక్యూబ్ వర్మ గారు.. నా బ్లాగ్కు విచ్చేసినందుకు చాలా ఆనందం గా వుంది.

@ బొల్లోజు బాబా గారు.. అవునండీ.. పుట్టి పోయేలోపు చూసే మన సమాజపు కొన్ని మచ్చు తునకలు..ధన్యవాదాలు.

@ చైతన్య గారు.. నేను ఈ కవిత రాయడంలో మీరిచ్చే కాంమెంట్ల ఊతమెంతో ఉంది. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు..

@ Anonymous గారు .. నేను రాసిన ఈ పదాలలో ఎక్కడైనా తెలంగాణా వ్యతిరేకతత్వం స్పురించినట్లైతే మన్నించగలరు. నేను నా విద్య నబ్యసించిందీ ఇక్కడే ఉద్యోగ రీత్యా నివసిస్తున్నదీ ఇక్కడే. కాకుంటే.. ఈ ఉద్యమాల వల్ల కాస్త ఇబ్బంది పడ్డ వాళ్ళ జాబితాలో నేనూ ఉన్నాను. అంత మాత్రాన మాతృ భూమిని ఎవరు మాటలంటారు చెప్పండి? అయినా తెలుగు మాట్లాడేవాళ్ళందరూ తెలుగువాళ్ళే.. తెలంగాణా , రాయలసీమ .. ఆంధ్రాల గురించి నాకు తెలియదు..

@ Nayani Aditya Madhav గారు .. ఇందులో ఎంతైనా మీరందించిన స్ఫూర్తి లేదంటారా? ఎల్లప్పుడూ నా వెన్నంటి నిలిచినందుకు.. ధన్యవాదాలు..

Anonymous said...

Bagundi

చైతన్య said...

నాకు ప్రత్యేక ధన్యవాదాలా!?
మీరు పొరపాటు పడుతున్నారేమో... మీరనుకునే చైతన్య వేరేమో!

Sahiti said...

super boss, great...

Nutakki Raghavendra Rao said...

శివ గారూ, మీ బ్లాగులో విహారానికి వచ్చి వుండకపోతే మంచి భావుకతను మిస్సయ్యేవాడిని.నా పోస్ట్ పై కామెంటు చేసి నాకీ అవకాశమిచ్చారు. థాంక్స్. అభినందనలతో.....నూతక్కి