Monday, December 28, 2009

నేను మోసపోయానా?




నేను మోసపోయానా?
దయ చేసి అవునని చెప్పొద్దు

ఎందుకంటే నేను నమ్మాను..
మళ్ళీ మళ్ళీ నమ్మాను
గుర్తులేనన్ని సార్లు నమ్మి..
మాట పెగలక మిగిలిపోయాను

మిగిలిన కాస్త ఓపిక పోగేసి
సర్ది చెప్పుకున్నాను.

తెగిన ఆ రెక్కలు
ఇక రావని తెలుసు

నా భవిష్యత్తు
శాశ్వతంగా నిద్రపోయిందని తెలుసు

తిరిగి నేను నవ్వలేనని
జ్ఞాపకాల శిధిలాలో స్తభ్దంగా ఉండిపోతానని తెలుసు

ఇన్ని తెలిసినా నేను ఒక్క మాట అనలేదే..
నా అశ్రువులు ధారలైనా
ఊపిరాడక నే విల విల లాడుతున్నపుడైనా
ఏమనలేదు... ఎవ్వరినీ..

ఎవరి సంతోషంలో నన్ను భాగస్వామిని చేయమనలేదు
నా వైన క్షణాలను లాక్కోవదన్నాను
అంతే..అదే నే కోరుకున్నది

ఎందుకంటే నేను ఓటమిని ఒప్పుకోగలను కానీ
నన్ను ఓడించి నావాళ్ళు కూడా నాతోపాటే ఓడిపోయరంటే
వాళ్ళను వాళ్ళే మరింత అగాధాల్లోకి తీసుకెళ్ళి పోతుంటే
ఇక ఎవరు గెలిచినట్టు?

నేనూ నా వాళ్ళు కాక ఇంకెవరున్నారిక్కడ
ఎవరూ లేరని నాకూ తెలుసు

అందుకే
దయచేసి అవునని చెప్పొద్దు
ఓడిపోయానని గుర్తు చెయ్యొద్దు.

10 comments:

  1. chala depth undhi...paravaledhu starting kodhiga bore kotinchina ending touch chesavvu.

    ReplyDelete
  2. నాకు సరిగా అర్థం కాలేదు!

    ReplyDelete
  3. చైతన్య గారు ...
    ఈసారి నా కలం అక్షరాలను కొంచెం పర్సనల్ గా తీసుకుంది.. ఇష్టం వచ్చినట్టు రాసేసింది.. వేరెవ్వరినీ ప్రత్యక్షం గా గానీ ... పరోక్షం గా గానీ నా పదాలలో ప్రదర్శింప జేయకూడదని .. కొన్ని .. కాదు కాదు ..చాలా లైన్లు తీసేసాను .
    అందుకే కాస్త అర్ధం కొరవడినట్టుంది. మరింత ప్రయత్నించాల్సింది..

    మొత్తం గా సారాంశం ఇది ..నావాళ్ళు అని నేను నమ్మిన వారి చేతే మోసగించ బడ్డాను. కానీ ఆ నిజాన్ని నేను ఒప్పుకోలేను. ఎందుకంటే నమ్మకమే నా బలహీనత. అందుకే ఎవరూ నేను ఓడిపోయానని గుర్తుచేయోద్దని మనవి..

    నా బ్లాగ్ కి విచ్చేసిన వారికీ.. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినవారికి నా ధన్యవాదాలు..

    ReplyDelete
  4. meeru vyakthigatmuga rasindi ayina bhavanm bagundi ayina nammakam balam ayinappudu balahinam ela avutundi?

    ReplyDelete
  5. ipudu naku doubt vastondi nenu vodipoyana???????????



    gud one......

    ReplyDelete
  6. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
    "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
    కోసం ఈ కింది లంకే చూడండి.
    http://challanitalli.blogspot.com/2009/12/2009.html

    ReplyDelete
  7. Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)

    ReplyDelete