Saturday, December 26, 2009

దేవుడా ...ఎవరికీ చెప్పకు




దేవుడా ..?

జడపదార్ధాలకు
ఇంత జీవమిచ్చి
అంత విజ్ఞత జోడించి
మాంసపు ముద్దలను మనిషిగా చేసి కిందకొదిలేసావు

ప్రకృతి తో మమేకమయ్యి
ఆనంద నిలయాలను నిర్మిస్తాడనుకొని ఉంటావు

నీకు విశ్రాంతి నిచ్చి ...
విశ్వాన్ని ప్రేమ మయం చేయడం లో నీ పాత్ర తీసుకుంటాడని ఊహించి ఉంటావు

చివరి వరకు అతడు అతనిలానే జీవించి ..
నీ సాన్నిధ్యం చేరుతాడని ఆశించి ఉంటావు కదూ

ఎంత ముచ్చటపడి ఉంటావో మరి
నీ దిష్టి గాని తగల లేదు కదా ..?
లేక నీ లెక్క గాని తప్పు కాదు కదా ..?

ఏం చెప్పను..
పుర్రెకో బుద్దాయే!

నాది నాది అంటాడు ఒకడు
దోచుకోబడ్డానంటాడు ... ఆరళ్ళు పెడతాడు.. అల్లర్లు చేస్తాడు

తోచింది చేస్తాడు మరొకడు
స్వార్ధమెరుగనంటాడు..నా కోసమా? కాదు ... సమైక్య ప్రయోజనమంటాడు..

స్వీయ ఉద్దరణ మాని
దేశోద్ధారణ పేర ఏవేవో వింత పోకడలు పోతుంటాడు

ఇక్కడ ప్రతి వొకడూ మయసభ నిర్మాణధనుడే
ప్రతి వొకడూ దుర్యోధనుడే

పెద్ద ఎత్తున...
ఎవడి శ్మశాన వాటికలు వాడే తాయారు చేసుకుంటున్నాడు
ఎంత కాలమని ప్రపంచాన్ని అదే కిటికీ లోంచి చూస్తాడు?

అర్ధం కాని అవక తవకల ఈ స్థితికి
కారణం ఆదిలోని నీ సృష్టేనని ఎవరికీ చెప్పకు

చెప్పినా నాలాంటి ఛాందసులు నమ్మరులే గాని
బయటవరెవరైనా నవ్వి పోతారనేదే నా భయమంతా.. !

7 comments:

Cheruvu N said...

మీ ఈ టప చాల బగుంది. ఆవతర్ సినెమా మరియూ ఆంద్ర/తెలంగాణ గొడవలు మీ కవిత కి ప్రెరెపరన అని అనుకుంట.
ఏది ఎమైన మనిషిని మనిషి చంపుకొవటం, సర్వం తగల బెట్టటం బగాలెదు.
ఆభివ్రుద్ది కుంతుపదింది,సమాన్య జీవనం దుర్బరం ఐంది. భయటకు వెలిథె వచ్చెవరకు భయం. ఇల ఇంక ఎన్నిరొజులు. సమైక్య జీవనం కాదు, సమరస్య ప్రశాంత జీవనం కావాలి. ఆందుకు చెయలి నిరహర దీక్షలు. Ramki

విశ్వనాధ ప్రసాద్ said...

సరిగ్గా చెప్పారు...its too much true...

MURALI said...

CHALA BAGUNDI

kavya said...

చాల బగుంది
మీరు చెప్పింది చాలా కరెక్ట్.

HARI said...

very nice one and touching boss
keep it up

chaitanya said...

Loved it!!

Sahiti said...

chaala baga rasaru...alochimpa chesaru..