Friday, December 11, 2009

అమరావతి సినిమా సమీక్ష
వారం నించీ చూద్దామని తహ తహ లాడిన అమరావతి సినిమాని చివరికి ఈరోజు చూసాను..

సినిమాకి దర్శకులు రవిబాబు ప్రాణం పోసారు. సినిమా మొదటి అర్ధభాగం ఆసక్తికరంగా సాగుతుంది. ద్వితీయార్ధం అంతా ప్రధమార్ధం లో సన్నివేశాలు, చిక్కుముళ్ళ గురించి ఉంటుంది. చిత్రంలో నటీనటుల నటన పాత్రలకు తగ్గట్టు ఉంది. ఎక్కువగా కామెడీ విలన్ గా చూసిన రవిబాబు ఈ చిత్రంలో కధానాయకుడుగా కనపడతారు. కధకి ముఖ్యమయిన పాత్ర ప్రతినాయకుని పాత్ర అందులో "తారకరత్న" ఆకట్టుకుంటారు.
ఇద్దరిదీ ఇందులో కొత్త నటన కనపడుతుంది.తారక రత్న గొంతు కొన్ని సన్నివేసాలలో మరింత గంభీరంగ ఉంటే ఇంకా బాగుండేది. ఈ కధకి భూమిక, స్నేహలాంటి established artists అవసరం లేదు. వారి బదులు మరెవరయిన నటించినా కధ నడిచేదే. సినిమాలో మలుపులెక్కువే. అయితే మొదటి పది నిమిషాల్లోనే కధలో violence ఉంటుందని చెప్పేస్తారు. మరు పదినిమిషాల్లో suspense మొదలౌతుంది. ఇక అక్కడి నించీ కధ పరుగులు పెడుతుంది. కొన్ని కొన్ని సన్నివేశాలకు ఎక్కువ లెంత్ తీసుకున్నరేమో అనిపించింది. సినిమా క్లైమాక్ష్ సన్నివేశం వేగంగా సాగుతుంది. సాగతీయలేదు కనుక మరి ప్రేక్షకులకి కూడా పాత్రలతో పాటే ఉన్నటు భావన కలుగుతుంది. ఇక సినిమాలో బాగున్నవి.. బాగోలేనివి.. ఇలా వున్నాయి..
========================================
బాగున్నవి..

చిత్రీకరణకు ఉపయోగించిన రంగులు
నటీనటుల నటన
ముఖ్యంగా సత్యానంద్ అందిచిన కధనం
శేఖర్ చంద్ర - నేపధ్య సంగీతం (సినిమాలో పాటలు లేవు)
ఆసక్తి కలిగించే కధలో మలుపులు
విశ్రాంతి సన్నివేశం
భారీగా లేని సంభాషణలు
మాక్ - అప్
========================================

బాగోలేనిది..

రక్తం ఎక్కువ సన్నివేశాలలో వాడడం
స్రీలపై దాడులు చేయడం అదే ఎక్కువ సార్లు చూపించడం
పైశాచిక ప్రేమ (అతి ప్రేమ కన్నా అతి ప్రేమ)
క్రూరత్వం (మొదటి పది నిమిషాలలో )

========================================

సినిమా బాగానే ఉంది కాని, పైన చెప్పిన "బాగోలేనిది.." వల్ల సినిమా నాకు నచ్చలేదు.
దయ చేసి గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, గుండె జబ్బు ఉన్న వాళ్లు సినిమా చూడకండి

సినిమా కధ గురించి నేను ఏమీ చెప్పను. ఎందుకంటే ఉత్కంట కలిగించే చిత్రాల కధ ముందే చెప్పేసుకుంటే మజా ఉండదు. లేదు తెలుసుకుని తీరాలంటారా.. తరువాత కింద లింకు చూడండి

http://navatarangam.com/2009/12/amaravathi-telugu-film-review/

7 comments:

Cheruvu N said...

Ee Sameeksha chaala baaga raasaru. Mee opinion ani cheppatam naaku nachindi. Katha gurinchi rayakunda, separate ga link ivvatam mee ee post lo ok kotta konam...
Nenu Kathanam emito chadavaledu... Cinema choosina taruvatha chadivi chepta..
Anyways i appriciate your time and review on this movie...

Takecare
Bfn.. with love
Ramki

creativekurrodu said...

nice way of review!
good post by u

రాజశేఖరుని విజయ్ శర్మ said...

కథను నడిపించిన తీరు బాగుంది. కానీ మరీ గర్భవతులను కోసే సీన్ లు నేను జీర్ణించుకోలేక పోయాను. నా వరకు చెప్పాలంటే ఈ సినిమా నచ్చలెదు. కానీ సస్పెన్స్, రక్తపాతాలు అంటే చెవికోసుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.


" ఈ కధకి భూమిక, స్నేహలాంటి established artists అవసరం లేదు. వారి బదులు మరెవరయిన నటించినా కధ నడిచేదే. "

తెలిసిన మొహాలు ఉండబట్టే సినిమా చివరవరకు చూడగలిగాను నేను.

బాగా రాస్తున్నారు. మరింత మెరుగు పరుచుకోండి.:)

పరిమళం said...

రివ్యు బావుంది మీరన్నట్టు భూమిక వంటి నటి అవసరం లేదనుకుంటా ...బహుశా రవిబాబు సెంటిమెంట్ గా పెట్టుకున్నారేమో

cherrys world said...

nice review brother

cartheek said...

Good review..

cartheek said...

Good review..