Sunday, November 29, 2009

ప్రేమే నిజమైతే..!




ఇకపైన కలలు రావు
ఊహల అవసరం కూడా నాకు రాదు

ఏ గాయాలకు నన్ను నేను సిద్దం చేసుకోనక్కరలేదు
వాస్తవ అవాస్తవ అవస్థల చర్చ కూడా నాలో ఇక లేవనెత్తదు
మరింకేదో వెతుక్కోవడమూ.. జరగదు

దూది కన్నా తేలికగా తేలిపోతుంటాను
గాలిపటాన్నై మేఘాన్నంటుతాను
మనసుననుసరించేస్తాను
భూమి చివరిదాకా పరిగెడుతాను

ఆపై మాటలు దాచక
నాకన్నా నన్ను నేను గొప్పగా వ్యక్తీకరిస్తాను

ప్రతిక్షణం...
ఆశ్చర్యానికిలోనౌతాను
జీవించేస్తాను
అభేదమైన ఓ స్థితినంటుతాను

భూత.. భవిష్యత్.. వర్తమాన.. కాలాల్లోనూ నేనే వుంటాను


:- ఈ కవిత రాయడానికి ప్రోత్సాహమిచ్చిన "పద్మార్పిత" గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

9 comments:

  1. "ఏ గాయాలకు నన్ను నేను సిద్దం చేసుకోనక్కరలేదు
    వాస్తవ అవాస్తవ అవస్థల చర్చ కూడా నాలో ఇక లేవనెత్తదు
    మరింకేదో వెతుక్కోవడమూ.. జరగదు"Beautiful!

    ReplyDelete
  2. ప్రేమే నిజమైతే...? అంటే ప్రేమ విజయవంతమైతే అనే భావంలో రాశారనుకుంటున్నాను.

    చాలా బాగుంది.

    " దూది కన్నా తేలికగా తేలిపోతుంటాను
    గాలిపటాన్నై మేఘాన్నంటుతాను
    మనసుననుసరించేస్తాను
    భూమి చివరిదాకా పరిగెడుతాను "

    ఎంత ఆనందమో కదా.... :):)

    మాటలు చాలవు. మది నిలువదు. ఉత్సాహం ఉరకలేస్తుంది.

    ReplyDelete
  3. "అభేదం లేని ఓ స్థితినంటుతాను"

    ఈ ప్రయోగం తప్పేమో ఓ సారి ఆలోచించండి. భేదం లేని అనాలి, లేదా అభేదమైన అనాలి అనుకుంటున్నాను. అలా అయితేనే మీ భావానికి సరిపోతుంది.

    ReplyDelete
  4. పరిమళం గారు ధన్యవాదాలండి

    విశ్వప్రేమికునికి... ఎస్. మీరు సరిగ్గా చెప్పారు "అభేదమైన స్థితికి చేరుతాను" అని సరి చేశాను "వ్యత్యాసములు లేని" అనేది ఇక్కడ నా భావం. రాయడంలో కొంత తొందర పడ్డాను ... ;) Thanks

    ReplyDelete
  5. premantene nijam, malli adi nijamaite ane prashna avasaramledemo ayina danini mee drusthilo baaga anvainchi raasaru kaani mee rachanallo intakumundu unnatuvanti padunu ledu, koncham saana pettandi,meelo oka goppa kavi daagunnadu velikitiyandi.. :)

    ReplyDelete
  6. sivagaru, nenu mi kavitalni chusi chaala anandinchanu kani idi mee sthayiki taggattuga ledani anipinchindi antey,

    bagundi :)

    ReplyDelete
  7. guruvugaru ee blogu chudandi.......
    http://neevuleka.blogspot.com/

    ReplyDelete
  8. మీ కవిత చదువుతుంటే నా మనసు కూడా తేలిక పడుతుంది...నాది కూడా ప్రేమేనన్న సాక్ష్యమిస్తుంది...మీ కవిత నా ప్రేమకి ప్రమాణమయ్యింది ... జొహార్లు

    ReplyDelete