Friday, October 23, 2009

నీకేం..!




నీకేం..!
ఓ నవ్వు నవ్వి ఊరుకున్నావు
కాస్త కన్నెగరేసి జారుకున్నావు
నన్నేమో ఊహల కొదిలేసావు

అదిగో అప్పటినించీ
మొదలయింది..

చూసి చూడకుండా ఓ చూపు చూస్తావే
దాని కోసం ..

కనపడనీయ కూడదని తడబాటును దాస్తావే
దాని కోసం..

నీ వెనుకే నే వున్నానని ఆగి ఆగి నడుస్తావే
దాని కోసం..

నన్నాపుకోలేక నిన్ననుసరించడం

ఏమనవు
అననీవు..

చేరువ కానిచ్చి
చొరవ తీసుకోనీవు..

ప్రశ్నల్లే కనబడతావు
జాబూ నీవేననిపిస్తావు
అర్ధం కావు...

14 comments:

  1. కవిత బాగుంది .. మొదటి ప్రేమలో తియ్యదనం.. తెలియనితనం రెండు బాగా వ్యక్తపరిచారు .. మీ కవితకు నా జోహార్లు

    ReplyDelete
  2. Chala baga raasaru... Prema modalithe ela untundo..alage raasaru....
    Ramki

    ReplyDelete
  3. ప్రతి మనసులోని ప్రేమికుణ్నీ తట్టి లేపారు. ప్రేమిస్తే కానీ అర్థంకాని ఓ తియ్యని బాధ ఇది. చాలా బాగా రాశారు.

    ReplyDelete
  4. అందరికీ ధన్యవాదాలు..

    ReplyDelete
  5. అందుకే అంటారండీ..అమ్మాయిలని, ఆల్జీబ్రా ని అర్ధం చేసుకోవటం కష్టం అని :)

    బాగా రాసారు.

    ReplyDelete
  6. @srujana gaaru, thanks andi..

    @sekhar gaaru, correcte nandi aa ardham chesukovadam lone boledanta aanandam untundi.. kada mari.. anduke kashtalu tappatledu. ;)

    ReplyDelete
  7. ఆ మధురక్షణాలు జీవితకాలం పదిలం....

    ReplyDelete
  8. శివ గారు ,మిబ్లాగ్ పేరు వెరైటీగా ఉందండీ.'నీకేం '...కవిత బాగుంది ,శ్రీశైల మల్లన్న ఫొటోస్ చాలా బాగున్నాయి .

    ReplyDelete
  9. Siva,

    Meeko Namaskaaram,
    Mee andamaina kavitalakoo Namaskaaram,
    aa chakkani padakoorpuki Namaskaaram,
    andamaina bhaavaniki Namaskaram.

    mottanga... Mee Blogke O Peddda Namaskaaram.

    ae kavita aina andulo sunnitamaina bhavaanni chaala chakkaga cheppagalagadame nee plus point.
    KEEP IT UP, Mitrama!!
    chaala adbhutanga undi nee kavita!!!

    ReplyDelete
  10. super this post is the mirror image of all lovers waiting for their love's acceptance....

    ReplyDelete