Friday, October 23, 2009

నీకేం..!




నీకేం..!
ఓ నవ్వు నవ్వి ఊరుకున్నావు
కాస్త కన్నెగరేసి జారుకున్నావు
నన్నేమో ఊహల కొదిలేసావు

అదిగో అప్పటినించీ
మొదలయింది..

చూసి చూడకుండా ఓ చూపు చూస్తావే
దాని కోసం ..

కనపడనీయ కూడదని తడబాటును దాస్తావే
దాని కోసం..

నీ వెనుకే నే వున్నానని ఆగి ఆగి నడుస్తావే
దాని కోసం..

నన్నాపుకోలేక నిన్ననుసరించడం

ఏమనవు
అననీవు..

చేరువ కానిచ్చి
చొరవ తీసుకోనీవు..

ప్రశ్నల్లే కనబడతావు
జాబూ నీవేననిపిస్తావు
అర్ధం కావు...

Sunday, October 4, 2009

ఏది కాపాడగలిగింది ?




జీవిత కాలం కూడబెట్టిన జీతపు సొమ్ము
సంఘానికి భయపడి, నటించిన మంచితనం
కోర్కెలణచుకొని, చేశాననుకున్న త్యాగం
మందులేసుకుని, కాపాడుకుంటున్న ప్రాణం
పూజలు చేసి, పోగేసుకున్న పుణ్యం

ఏది ఆపగలిగింది
బలవంతంగా ఆగిపోతున్న హృదయపు లయని..

ఏది కాపాడగలిగింది
ఊపిరాడక, చేత కాక చల్లబడిపోయిన శరీరాన్ని..