Saturday, August 8, 2009

చెరిగి పోతున్నై..




కిరసనాయిలు బుడ్డీలెలిగించుకుని
కాసింత చద్ది కూడు కుండలో ఎట్టుకుని
సముద్రానికి ఇంతే దూరంలో కూకుని
గుంటలడిన గోళీ కళ్ళతో..
అటు ఏపే సూత్తన్నా ..

ఏడదాకొచ్చిండో కొడుకు
ఇంతన్నం దిని తొంగునేటోడు ఈ ఏలకు

గుడిసె ఇడిచేప్పుడ్డన్నాడు ..
"ఈ ఏల బంగారం తెత్తా" నని
నవ్వి ఊరుకున్నా..గాని ఏమనలేదు ..

రానీ.. ఇప్పుడు సెపుతా ..

ఇదిగో ఈ సినిగిన గుడ్డలు ఏసుకుని.ఉంటా..
అర కొర ఆకలి నింపుకుని..
ఓ మూల పడుంటా గాని .. మరింకేటీ మనకొద్దని..

సంద్రంలో సగానికి మునిగిన పడవ లాటి బతుకులు మనయి..
బ్రతకడమే గావాలి గాని..
రేపటిమీద అత్యాశ వద్దని..

యేడి..
గంటలయిపోతున్నా..ఇంకా రాడే..

చీకట్లో గుచ్చి గుచ్చి ఎతికే కళ్లు..
ఆడిగురించింకా ఏమనట్లేదే..

అరె ..
కాసింత బుడ్డి యెలుతురూ పోయింది..
మొత్తం చీకటైంది..

చూసే లోపలే..
తీరం
అంచున ఇసుక మీద
పడీ
పడని కాలి అచ్చులు ..
అలలు తమ చివర పోగుచేసుకున్న నురగ తాకి..
చెరిగి పోతున్నై..



.

9 comments:

Your Tech Spot said...

Nice...

http://youritzone.blogspot.com
http://onetechspot.blogspot.com
http://urtechguide.blogspot.com
http://onetechsite.blogspot.com
http://thecomputersight.blogspot.com

Thanks!

భావన said...

పిచ్చి తల్లి.

ఉష said...

మీ కవితా వస్తువు బాగుంది. "జాలమేలా జాలరోడా ..." అనే పాటకి మేము నృత్యం చేసేవాళ్ళం, "..ఏడేడు సంద్రాలు మాకు పుట్టిల్లు..గంగమ్మ తల్లిరో జేజేలు కొడతాము, కాపాడి రక్షించవమ్మా.." ఇదీ క్లుప్తంగా భావం. అది గుర్తుకొచ్చింది. అలాగే నా కవిత "హరివిల్లు - ౩ : భువిలో దాగినదేమో?" http://maruvam.blogspot.com/2009/06/3.html చూడండి, నీలి రంగు ప్రతీకకి జాలరే నా నాయకుడు.

విశ్వ ప్రేమికుడు said...

చాలా బాగారాశారు. పేద తల్లి కడుపుతీపి... బంగారం తేవాలనే ఆ పల్లె వాడి ఆశ... చాలా బాగా పండింది. వారి యాసను వాడుకోవడంలో '' దాదాపుగా '' సఫలీకృతులయ్యారు.

Creative Kurrodu said...

:)

కొత్త పాళీ said...

విశ్వప్రేమికుడిగారి మాటే నాదీనూ

శివ చెరువు said...

అందరికీ ధన్య వాదాలండి..

Anonymous said...

Me Before & After- blog choosanu.
baagundi :)
maarpu ante yemiti friend?

Blogu bevarsu said...

very nice one super :)