Tuesday, August 4, 2009

ఆకాశ వీధిలో..




మైత్రీ వనంలో వూయలూగాలని..

కలిసి..
ఆగని
గీతానికి రచన చేయాలని...

ఒకటిగా ఆదమరిచి పోవాలని..

ఇంకా..
ఇంకా...

ఎన్నెన్నో ఆలోచనలు..ఇటుకలు చేసి..
కట్టుకున్న భవంతిలో ఇలాగే వేచివున్నాను..

ఇన్నాళ్ళూ నేనేనా..
ఇంత కాలం నాదేనా.. ఆత్రుత..నీ కోసం...

అనుకుంటున్నా ...!

అప్పుడే.. ఎక్కడినుండో గాలి అలలు...
ఈ కబుర్లు తీసుకొచ్చాయి...

నీలి గగనాన ..
ఆ తారల మధ్యన..

వెలుగు తీగల.. వెనుకకు చూస్తూ
నా రాకను ఆశిస్తూ..

ఆకాశ వీధిలో..
తారాడే నీ ఊహలు ..

నాకన్నా ఎక్కువగా
మన కలయికకు ఒక వేదికను వెతుకుతోందని....

8 comments:

కొత్త పాళీ said...

Interesting.
Please avoid so many dots and line splits.
1. It will be easier for the reader to read.
2. The meaning is conveyed much better.
At leats, that's my opinion.

Anonymous said...

చాలా బాగుంది

రవి :)

శివ చెరువు said...

కొత్త పాళీ గారు తప్పకుండా నండి. ఇక మీదట చుక్కలు తగ్గిస్తాను.. Thanks

ఉష said...

"మన కలయికకు ఒక వేదికను వెతుకుతోందని." ఆసన్నమవని ఆ ఘడియ మధురిమ ఎంత చక్కగా చెప్పారు? వేదికకే అంత సంరంభం సాగితే .. ఆపై..అన్న వూహ బాగుంది.

విశ్వ ప్రేమికుడు said...

కవిత కోసం మనసును ఇంకొంచెం పదునుపెడితే ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది.
ఉష గారన్నట్టు ఆమె మీకోసం ఎదురుచూస్తోందన్న ఊహ చాలా బాగుంది. ఈ మధ్య బ్లాగు లోకంలో ప్రేమ తిరస్కార కవితలెక్కువగా కనిపిస్తున్నఆయి. వాటినుండి మి కవిత కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. :)

sahiti said...

chala bagundi

శివ చెరువు said...

ఉష గారు.. భవిష్యత్తులో సమీపంలో లేని నిజం..కేవలం ..ఊహలలో మాత్రమే సాధ్యం కదండీ..
ప్రేమికుడు గారు..ఏదో వూరెళ్ళే హడావిడిలో .. అలా జారిపోయింది..ఈసారి..మరింత మెరుగ్గా రాసే ప్రయత్నం చేస్తానండి..
సాహితి..గారు.. ధన్యవాదాలు..

Creative Kurrodu said...

:)