Thursday, July 30, 2009

నాకు నేనూ లేను..!





ఎవ్వరికీ
తెలియని కథ ..
"నా"..లో.. "నీ".. కధ..
మొదలయిన ఆ రోజు.. నాకింకా గుర్తు..

అక్షరాలు
అందక..
ఖాళీగా వదిలేసిన .. నా డైరీలో ..ఆ మొదటి పేజీ..
నిదుర పట్టక చందమామను వెక్కిరించిన రీతి..
ఇంకెపుడో ఆ రేపటి ఉదయమని..
దూరంగా దిక్కును చూస్తూ గడిపేసిన ఆ రాతిరి..

అలా..
అలా ..
ఎన్ని రోజులో నాతో నడిచి వచ్చేశాయి..!

ఇదే నీతో చెబుదామన్నపుడల్లా.. నాలో ఆరాటం ..
ఇంకా ఆలోచిస్తూ వుండిపోయాను..
మరింకేదో అంటూ వచ్చేసాను..

ఆలస్యం చేశానేమో..
ఉన్నట్టుండి ఓ రోజు.. వచ్చేసిందో వార్త ..
నీకు నాకు మధ్య ..ఓ దూరం శాస్వతమౌతోందని ..
నా రాతలు..నన్నే చెరిపేసుకోమని...
చెప్పింది...
చెప్పి వెళ్లి పోయింది..

కన్నీటిని రెప్పలు దాచుకోలేవని..అద్దాలు అడ్డు పెట్టుకున్నాను......
చెంపకు పై పై నవ్వులు అద్దాను..
నీ తాలూకు గురుతులు నీకే వదిలేసాను..
ఆరాట పడక ఆగిపోయాను..

ఇప్పుడు ఆ కాగితాలూ లేవు .. నీవూ లేవు..
రాసిన నేను మాత్రం.. మిగిలిపోయాను..
అయినా నాకు నేనూ లేను..!

12 comments:

  1. మనకు మనం మిగలనీయక మనని మనకి పరాయిని చేసేదే ప్రేమ. మనవారికోసం వేదనపడమని వెక్కిరించేదే ప్రేమ మరి. ప్రేమించటానికి అందుకే సహనం, తెగువ కావాలి.

    ReplyDelete
  2. ఆవేదననీ ...అందంగా తెలియ చేశారు .చాలా బావుందండీ !

    ReplyDelete
  3. మీ కవిత్వ రితిలో ఓ చక్కని స్పష్టత వస్తోంది. ఇలాగే కొనసాగించండి. కవిత చాలా బాగుంది.

    ReplyDelete
  4. bagundi...
    mee lo nee Bhaavukatha..
    Keep it up!
    All the best!

    ReplyDelete
  5. ప్రేమలోని ఆవేదన, అనురాగం మధురం గా వ్యక్తం చేసేరు.. బాగుంది...

    ReplyDelete
  6. Naa blog ki vecchesi.. mee viluvaina abhiprayalanu..thelipinanduku..Andarikee dhanyavaadalu..

    ReplyDelete
  7. Chaala baaga mee avedananu vyakta parichaaru. prema maatrame saaswatam kadaa mitrama?

    ReplyDelete
  8. "నా"..లో.. "నీ".. కధ...superb asalu...
    చాలా చాలా బాగుంది...i loved it

    ReplyDelete
  9. ఇప్పుడు ఆ కాగితాలూ లేవు .. నీవూ లేవు..
    రాసిన నేను మాత్రం.. మిగిలిపోయాను..
    అయినా నాకు నేనూ లేను..!

    మీకు నేనున్నాను.........

    just kidding :)

    ReplyDelete
  10. చాలా చాలా బావుందండీ

    ReplyDelete