Monday, July 20, 2009

ఓ పెద్ద మనిషీ..




నాది పరాజయం..అంటున్నాడెవడో పెద్ద మనిషి..
అదే పనిగా నన్నే చూస్తున్నాడు..
సంవత్సరాల తరబడి వెంటాడుతున్నాడు..
ఓటమి పాలైనపుడల్లా ...ఓ వెక్కిరింపు నవ్వు నవ్వాడు..

బదులుగా ...

నేను కూడా నవ్వేవాడిని..
నా గెలుపు ఓటములకు నీవెలా నిర్నేతవైనావని..
నను నిర్దేశించే నీ కొలబద్దలేమని..

మార్పు కావాలనే వాదనే కానీ...

ఆలోచించాడా ఎపుడైనా..
ఏంచేస్తున్నాడని..?

ఆదరించాడా ఎపుడైనా..
ఆశతో.. తలుపు తట్టిన వారిని..?

మార్పు కోరుకునే అతడు...
మార్పుకు సిద్దపడి లేడు...

మరి ..
ఈ నవ సమాజ నిర్మాణంలో నా పాత్రనెలా ప్రశ్నించగలడు....?




.

6 comments:

rayraj said...

మిగితావింకా చూడలేదు.ఈ కవిత నచ్చింది.ఫోటోకూడా బాగా పట్టారు.

...Padmarpita... said...

కవిత బాగుందండి.

ప్రేమికుడు said...

బాగుంది :)

శివ చెరువు said...

rayraj...గారూ బ్లాగ్ కు స్వాగతం..

...Padmarpita...గారూ..ప్రేమికుడు ...గారూ..ధన్యవాదాలు..

Siva Cheruvu

పరిమళం said...

"మార్పు కోరుకునే అతడు...
మార్పుకు సిద్దపడి లేడు..."
బావుందండీ !

ఉష said...

ప్రశ్నలకి జవాబుదారీ కాని వారే మార్పుని సాధ్యం చేస్తారు. సంకల్పాన్ని వాయిదావేస్తే మనమూ ఓనాడు ఆ పెద్దమనుషుల్లో ఒకరిమయిపోతాము.