Thursday, July 16, 2009

ఇక ఆ యశోదకు ఏమివ్వగలను..




రంగుల జల్లునో..
దోచుకెళ్లిన హరివిల్లునో..

అతిధినా ఆ ఇంటికి నేను ..కానేమో..?
చిరకాలం ఉండిపోలేదు..
ఈ కృష్ణ పాదాల గురుతులు చెరిగిపోలేదు..

బతుకున ..వేడుకల రాయబారినా నేను..కానేమో?
సంబరాలు మోసుకొచ్చాను..
వరాల రుచి చూపి వెనుదిరిగాను..

ఇది ఆర్తి కాదని చెప్పలేను.. ఓదార్పు వెతుక్కోలేను..
అవ్యక్త భావనలో.. అటు ఇటు గా నేను..
గొంతుక గుమ్మం దాటిపోలేను...

ఇక ఆ యశోదకు ఏమివ్వగలను..


10 comments:

  1. నాది కూడా కొత్త పాళీ గారి మార్గమే

    ReplyDelete
  2. చాలా బాగుంది



    ఇక ఆ యశోదకు ఏమివ్వగలరు...


    ఈ కృష్ణ పాదాల తీపి గురుతులు తప్ప...

    ReplyDelete
  3. శివగారూ ! చాలా చాలా బావుందండీ !

    ReplyDelete
  4. superb....

    అవ్యక్త భావనలో.. అటు ఇటు గా నేను..
    గొంతుక గుమ్మం దాటిపోలేను...

    simply superb....

    ReplyDelete
  5. కవిత విభిన్నంగా బాగుందే అనుకుంటూ, ప్రేమికుడి గారి కామెంటు చూసాకా ఒక్కసారి ఒళ్లు జలదరించినట్లయింది. మరలా కవితను చదివాను. ఒక అద్బుతాన్ని దర్శించాను.

    ధన్యవాదములు

    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. No words to express.........

    ReplyDelete
  7. చాలా బాగుంది శివ గారు.

    ReplyDelete