Sunday, July 12, 2009

సొంత కధ..

కధని.. మూడు పాత్రల దృష్ట్యా చదవండి.. మీకు కధలో మూడు వివిధమైన . ముగింపులు.. తెలుస్తాయి..
అనగనగ ఒక పిల్లి, కుక్క , పంది... మంచి స్నేహితులు గా ఉండేవి...పిల్లికి దేనిమీదా స్థిరత్వం లేదు.. కుక్క ఏమి చెప్పినా నమ్మేస్తుంది..(గుడ్డి నమ్మకమన్న మాట..) ఇక పందికి పద్దతులు.. పాడు..ఏమి లేవు..ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలీదు... ఎప్పుడూ ఎవ్వరితోనో తిట్లు తింటూ వుంటుంది. అది చేసే..చెత్త పనుల వల్ల..

ఓ రోజు పిల్లికి ఒక ఆలోచన వచ్చింది.. ఎన్నాళ్ళిలా ...వీటితోనే తిరుగుతాం..ప్రపంచం చాల పెద్దది కదా..! నాకు వీళ్ళే మాత్రం.. విలువ ఇస్తున్నారు.... ఎక్కడికైనా వెళ్లి పోవాలి..ఏదో చేసెయ్యాలి..నేనే గొప్ప అనిపించుకోవాలి..

ఇంక పిల్లి అనుకున్నదే తడవు గా.. ఎక్కడికో వెళ్లి పోయింది..

కుక్క , పంది.. పిల్లి కోసం ఎక్కడెక్కడో వెతికాయి.. చివరికి కనిపించలేదని..చాలా భాద పడ్డాయి..

పిల్లి తిరిగి వస్తుందని..ఎక్కడో బాగానే వుందని కుక్క..నమ్మింది..
తనవల్ల పొరపాటు ఏదైనా జరిగిందేమో అని..పంది..ఇక పైన పద్దతి గా వుండడం మొదలు పెట్టింది..

కొన్ని నెలలు గడిచాయి..
.
.
.
.
.


పిల్లి చాలా చోట్ల తిరిగింది..కాని ఎక్కడా ..ఎవ్వరూ.. తనని గొప్ప అని వొప్పుకోలేదు సరికదా .. కనీసం సరైన ఆదరణ కూడా దొరకలేదు..

చివరికి తిరిగి..తన వాళ్ళ దగ్గరకి వచ్చేసింది..

కుక్క..పంది చాలా ఆనందపడ్డాయి ..కుశల ప్రశ్నల్లో..ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు మిత్రమా ? అని అడిగేటప్పటికి..స్నేహితుల ముందు నిజాలు మాట్లాడడానికి..జంకింది.. తడుముకుంటూ..తప్పస్సు చేసుకోవడానికి వెళ్లానని..ఏవో శక్తులు వచ్చాయని..ఇప్పడు ఎలాంటి..జబ్బునైనా ... నయం చేయగలనని.ప్రగల్భాలు పలికింది..

ఇక అబద్దాలతో..కొంత కాలం గడిచింది..

పిల్లి వూళ్ళో లేని సమయంలో ..ఒక రోజు..కుక్కకి జబ్బు చేసింది..
పిల్లి కోసం ఎదురు చూసి చూసి..జబ్బు పెరగసాగింది..పంది చాలా సార్లు చెప్పి అయినా వాటిని పెడ చెవిన పెట్టింది కుక్క .ఇంకా ఏదో నమ్మకం..తన స్నేహితుడు వచ్చి కాపాడతాడని..

ఆఖరికి కుక్క చివరి క్షణాల్లో..పిల్లి తిరిగి వచ్చింది..

పిల్లికి నిజం వొప్పుకోక తప్పింది కాదు..అయినా చేసేది లేదు.. కుక్క చనిపోయాక .. పిల్లి రెండు కన్నీటి చుక్కలు విడవడం తప్ప..

కాల క్రమేణా .. పిల్లి ..పంది కూడా విడిపోయాయి....


.

6 comments:

 1. Katha lo manchi msg undi.. Its a good story. Keep it up.

  ReplyDelete
 2. బాగుంది. :)

  మీ మొదటి ప్రయత్నమనుకుంటా... all da best. :)

  ReplyDelete
 3. చాలా చక్కగా వుంది.
  Please watch my latest posting

  ReplyDelete
 4. కధ ముగింపులో సందేశం బలంగా అందించటానికి ప్రయత్నం లేదు....కధ సగంలో ముగిసిపోయినట్లు అనిపించింది.. అబద్దాలు ఆడకూడదు, గుడ్డిగా ఎవరిని నమ్మరాదు అనేవి నేను అందుకున్న సందేశాలు ... కుక్క నమ్మింది తన ప్రాణ స్నేహితుదినే కదా .. మరి ప్రాణ స్నేహితుడిని నమ్మటం తప్పా ? ఈ కధలో పంది పాత్ర ఏంటి ? కుక్క పిల్లి తో కూడా కధ అలానే ఉండేది ...
  తెలుగులో కధ రాయాలి అన్న నీ తపన నచ్చింది. కొద్దిగా సమయం కేటాయించి కధలో పాత్రలకు న్యాయం చెయ్యటానికి ప్రయత్నించు ..

  ReplyDelete
 5. anonymous gaaru... Super ga chepparu.. First nakosam time theesukunnannduku thanks... nenu meetho poorthi gaa ekeebhavishtaaa... I am still in no-vice state....enduko cheptaa....Nenu kadha raasinappudu... naa brain lo unna idea entante.. three charecters..
  1.mosam chese paathra
  2.mosaniki guri ayye paathra..
  3.madhyastham gaa unde paathra...

  Nenu vaatini sarigga mould cheyyaledemo...

  I am very happy that told me this...

  Keep visiting and your cooperation is highly required.. :)

  Thanks,
  Siva

  ReplyDelete