Sunday, July 5, 2009

నీకు మాత్రం తెలియనిదా..?





స్నేహితులమా
?
రక్త సంభందమా?
దూరపు చుట్టరికమా?
మౌతామని ఒకరికి ఒకరం ...
మనలో ఎందుకీ మాటరాని తనం..

పైకే నా డాంబికం గానీ..
నాకే తెలియదు నేనెన్ని సార్లు సర్ది చెప్పుకున్నానో....

చూస్తుండగానే..ఆ సమయం వచ్చేసింది..
నా గడియారం నన్ను మరింత ముందుకు తోసింది..

చేతిలో చేయి వేసి ... నువ్వు వీడ్కోలు చెప్పేటప్పుడు..
నన్ను నీ గుండెకి హత్తుకున్నప్పుడు...

ఉండిపోదామనే ఉంది..
అని అరిచి చెప్పాలనుకున్నప్పుడు..

మూగ భాషనే ఆశ్రయించానేమోగాని గాని ..
మరేమీ..మాట్లాడలేదు..

ఎడబాటు తప్పదని తెలిసీ ...
మళ్లీ , .మళ్లీ...
ఎందుకు కలుస్తావని నన్నడిగిన ప్రశ్నకు...

ఏం చెప్పలేక పోయానేమో కాని...

కలిసిన ఆ కాసిన్ని క్షణాలు..ఈ ఎడబాటులో నాకు ఊపిరి పోస్తుందని...
నీకు మాత్రం తెలియనిదా..?


.

10 comments:

  1. siva gaaru..
    adbhutam...
    atyadhbutham...
    mee kavitaku naa deggara maatalu levu..
    naa hrudaya spandana tappa...........

    ReplyDelete
  2. బాగుంది శివ గారు. కవిత ఎంత బాగుందో.. పైన చిత్రం కూడా అంతే బాగుంది. అభినందనలు.

    ReplyDelete
  3. namaskaramandi shiva garuu,
    chala bagundi mee kavitha alagee
    na blog ki kuda vichhesi postings chusi mee amulyamina coments nu ivvandi
    untanu andi
    http://mirchyvarma.blogspot.com

    ReplyDelete
  4. kavita baagundi...superb paiting!!!

    ReplyDelete
  5. కవిత చాలా బావుంది హృదయానికి హత్తుకొనేలా .....
    పైబొమ్మకూడా బావుంది మీరువేసిందేనా ?

    ReplyDelete
  6. @Nayani Aditya Madhav gaaru..మీ అభిమానానికి ధన్యవాదాలు..
    @ఆత్రేయ కొండూరు gaaru..థాంక్స్ అండీ ... బొమ్మ గూగుల్ లో దొరికిందే..
    @MIRCHY VARMA OKA MANCHI PILLODU gaaru నా కవితని మెచ్చుకున్నందుకు థాంక్స్ ..మీ బ్లాగ్ కూడా చూసాను.. చాల బాగుంది..
    @...Padmarpita... gaaru..గొప్పతనమంతా ఆ చిత్రకారుడిదే..ఎంతైనా చిత్రకారులు ..చిత్రకారులు..ఒకటి కదా ! :)
    @పరిమళం gaaru..థాంక్స్ అండీ.. నిజానికి కవిత రాసిన తరువాత.. గూగుల్ లో వెతికా... ఈ పెయింటింగ్ అచ్చు గుద్దినట్టు సరిపోయిందనిపించింది ..:)

    ReplyDelete
  7. కవిత బాగుంది .. నేను కవితలని పెద్దగ ఫాలో అవ్వను కాని.. మీ కవితలో ఏదో ఆవేదన కనపడుతోంది .. ఇది పరిస్థితుల కారణంగా ప్రియురాలిని వీడిన ఓ ప్రేమికుడి వేదనలా అనిపించింది నాకు .. కధకి కొసమెరుపు లాగ ఆఖరి పంక్తి లో మంచి పంచ్ ఉంది ..
    ఫోటో చూస్తే చాలా చిన్న వారిలా ఉన్నారు .. కాని కవితలో మంచి డెప్త్ ఉంది :)

    ReplyDelete
  8. చాలా బాగుంది. మంకీ టు మాన్ గారి 2009 లో వారికి నచ్చిన పది టపాలలో ఒకటిగా వివరించడం వలన నేను చదవకుండా తప్పిపోయిన ఈ మీకవితను చదివే అవకాశం వచ్చింది. చాలా మంచి కవితన చదివాను. అభినందనలు. :)

    ReplyDelete
  9. చాలా బాగుంది
    happy new year

    ReplyDelete