Thursday, June 18, 2009

అమ్మ పాట...




కలం కలిసి అమ్మ పాట రాద్దామంది..
-ఇన్నాళ్ళకి...

అదిగదిగో .. ఆడిన రోజులు..
మురిసి.. ముద్దాడిన రోజులు ..

చిన్ని కృష్ణుడి పాటలు..
కృష్ణ పాదాల ఆటలు...
లయ తప్పద్దని.. అలసించిన ఆ రోజులు..

వరుసగా ఎదుట నిలబడ్డాయి..
కన్నులు చెంపలను తడి చేస్తున్నాయి..

ఇంతలో ..
సిరా చుక్కకు అక్షరాలు తడబడుతుంటే..

తనూ చాలనని..
కలం తిరిగి జ్ఞాపకాల వెనుకకు దాక్కుండి పోయింది ..

3 comments:

ఉష said...

ఆ బాల్యపు తడే బ్రతుకు పొడిబారకుండా కడ వరకు తోడుటుంది.

దొంగనా కొడుకు said...

బావుంది బావుంది

పరిమళం said...

అమ్మ ప్రేమలోని కమ్మదనం
చెంపను తడిపేయడమే కాదు
గుండెను నింపేస్తుంది ....