Saturday, June 27, 2009

ఆ వాన వెలిసింది...
చాలా కాలం తరువాత విచ్చేసిన అతిధిలా ..
మేఘాల గుంపు..మాఊరి కొచ్చింది..

నిట్టూర్పుల సెగ నుండి... విముక్తి దొరికేలా..
సన్నని.. చల్లని..గాలి..మొదలైంది..

వాలిపోయిన చెట్ల .. ఎండిన ఆకులు..
రెప రెపలాడుతూ .. రాలిపోతున్నై..

అదిగో.. చినుకులు మొదలైనాయి..
నీటి చుక్కలు కిందకి జారి పడుతున్నాయి..

పరవసించిందో ఏమో నేల...
మెండుగా మట్టి వాసనేస్తోంది..

క్షణంలో ...జోరు పెరిగింది..

అందరూ ఏ దొరికిన గూటికిందకో చేరిపోతున్నారు..

నేను మాత్రం...
చేతులు చాచి..వీధిలో ..నుంచున్నాను..
నన్ను నేను... వానకిచ్చేసాను ..

ఆకలేసిన పిల్లాడికి..
అమ్మ చేతి ముద్ద దొరికినట్టు...
ఎగిరి గంతేస్తున్నాను..

ఎంత సేపు గడిచిందో.. గురుతు లేదు కాని..

తరువాత..

ఆ వాన వెలిసింది...
నన్ను..తడి..చేసి వెళ్ళిపోయింది..


.

Monday, June 22, 2009

శ్రీ యోగానంద జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణం మే 10 2009

శ్రీ యోగానంద జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం.
చప్టా దిగువ, భద్రాచలం.

స్వామి వారి కళ్యాణ దర్శనం...

కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం .....for more information, please visit http://srinrusimham.bravehost.com/

.

Thursday, June 18, 2009

అమ్మ పాట...
కలం కలిసి అమ్మ పాట రాద్దామంది..
-ఇన్నాళ్ళకి...

అదిగదిగో .. ఆడిన రోజులు..
మురిసి.. ముద్దాడిన రోజులు ..

చిన్ని కృష్ణుడి పాటలు..
కృష్ణ పాదాల ఆటలు...
లయ తప్పద్దని.. అలసించిన ఆ రోజులు..

వరుసగా ఎదుట నిలబడ్డాయి..
కన్నులు చెంపలను తడి చేస్తున్నాయి..

ఇంతలో ..
సిరా చుక్కకు అక్షరాలు తడబడుతుంటే..

తనూ చాలనని..
కలం తిరిగి జ్ఞాపకాల వెనుకకు దాక్కుండి పోయింది ..

Saturday, June 13, 2009

ఆనందం ..
ఆనందం ..ఆనందం...

వేకువ ఝామున .. భానుని పుట్టుక...
కష్టించిన వంటిని..కౌగిలించే నిద్దుర

కోరుకున్న తోడు ..
కావలసినప్పుడు దొరికిన ఏకాంతం

కలిసి సమయాన్ని ..జయించిన ఆదమరుపు
విరహంలో ప్రేయసి తలపు..

ఆనందం .. ఆనందం ..

ప్రతి ఉదయం..
ప్రతి హృదయం....

ప్రతి నిమిషం ఆనందం

ఆనందం ..ఆనందం...
.

Wednesday, June 10, 2009

నిరాశకు వీడ్కోలు చెప్పాను..
చాలా కాలం గా ...ఏవేవో ఆలోచనలు..
అవే అవే .. ఆలోచనలు..

ఏదో జరగలేదని ..
మరింకేదో కాలేదని..

గడచి పోయిన రోజుల్లోనే.. ఉండిపోయాను..
నన్ను వేదనతో నింపుకున్నాను..

నేను అసమర్దుడనని...నమ్మి నిల్చుని ఉండి పోయాను

ఏం జరిగింది ...?
.
.
.
.

ఏమీ జరగలేదు..

అందుకే ..
విరిగిన ఆ ఆశల పల్లకీ బాగు చేసుకున్నాను ...

నిరాశకు వీడ్కోలు చెప్పాను..
మళ్ళీ నా ప్రయాణం మొదలు పెట్టాను ...

Wednesday, June 3, 2009

ఏ సూర్యుడో ఉదయించే దాక ...
ఆలోచిస్తావనుకున్నా ...
అర్ధం చేసుకుంటావనుకున్నా..

ఆకాశం విరిగి మీద పడ్డా ..
నీ మాట నీదే నన్నావు..

నచ్చ జెప్ప జూస్తే ...
నీవెవరన్నావు..

వెలుతురు లేని రాతిరిలో...
నన్నొదిలి బయటకు పోయావు..

లెక్క చేయలేదని కాదు..నా భాధ..

నేస్తం... నీవేమౌతావనేదే .. నా భయం ...

అందుకే నా మరో ప్రయత్నం గా

చేసేస్తున్న..
చుక్కలకు చిన్నవిన్నపం
చూపిస్తాయని చిరు దీపం

ఏ సూర్యుడో ఉదయించే దాక ......