Tuesday, April 28, 2009

భగవంతుని కోరిక...!





మనం గుళ్ళో .. ఇంట్లో.. రోడ్డు మీద..అని చూడకుండా..ఎక్కడ పడితే.. అక్కడ. మనకేమైనా.. కావాలంటే. ..దేవుడిని..ప్రార్థిస్తాం...

అయితే.. భగవంతునికేమైనా.. కావాలంటే.. ఎవరిని ప్రార్థిస్తాడు..?అసలు..ఆయనకీ..కోరికలు ఉంటాయా ..?
....
....
....
....
....

నా అనుభవ పూర్వకం గా..కోరికలు..మనకే ఉంటాయి...

పరిస్థితులను బట్టి..
ఆయనకు మనమే....మనకున్న ఆలోచనలని.. ఆ కోరికలను..కలలను..ఆపాదిస్తాం..

దేవుడు..లేక దేవత..మన నమ్మకాలకు..రూపాలు..

మంత్ర పుష్పం లో చెప్పినట్టు.. " అంతర్ భహిర్థ్యతత్ సర్వం వ్యాప్త్య నారాయణ స్థితః " ఆ భగవంతుడు.. లోపల బయట అంతటా వ్యాపించి వున్నాడు..

అప్పుడు లోపల వున్న ఆయన... కోరికలు..మన ద్వారా బయటకు వస్తాయి కదా..
నర నారాయణులు.. చూపులకు.. రెండు రూపాలు కాని.. ఆత్మ స్వరూపం ఒకటే కదా...!

అంటే.. అహం బ్రహ్మాస్మి..భగవంతుని కోరిక నా కోరిక ఒకటే (నా ద్వారా బయటకు. వస్తోంది..)నాకు కోర్కెలు లేవు.. అన్ని ఆయనవే...

ఇది కేవలం నా అభిప్రాయం..ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని కాదు..
స్నేహితులు.. మీరూ ఓ రెండు మాటలు.. చెపుతారని.. మీతో ఇలా పంచుకునే ప్రయత్నం...

"స్పర్ధయేన లభతే విద్యా.."

అయితే.. నా ఈ ..ఆద్యాత్మిక పథంలో.. నాతో.. ఇదే ఆలోచన కొనసాగుతుందని నేనూ చెప్పలేను.. ఇదీ... శాశ్వతం కాదు..రెండేళ్ళ క్రితం నేనూ .. ఇప్పటి నేనూ ఒకటి కాదు కదా...ముందడుగు వేస్తూనే వుంటాను..

ధన్యవాదాలు...
శివ చెరువు

6 comments:

శివ చెరువు said...

Comment section ఇప్పుడు ఎనేబుల్ అయ్యింది...

Thanks,
Siva Cheruvu

CREATIVEKURRODU said...

vahva vah vaa!!!!!!!
yem chepparu meeru (mI loni bhagavantudu?)
:)

పరిమళం said...

నేను దేవుడ్ని సినిమా గాని చూశారా ఏంటండి ? :) :)

శివ చెరువు said...

Dhanya vaadaalu :)

Ramki said...

'Aham Bramhasmi' ante meeru cheppina artham kaademo... Nee Devudini ani artham.. Konchem alochinchi choodamdi...
Ramki

SATHYA said...

మరాలనుకున్నప్పుడే కొరికలు పుడతాయ్..

భగవంతుడు మీ కొరికలన్ని తీరుస్తాదు కాని మీ స్వతంత్రతని మాత్రం భగ్నం చెయదు... మీ రన్నట్టు
(మార్పు కోరుకునే అతడు...
మార్పుకు సిద్దపడి లేడు...)

కాబట్టి కొరికలు తీరడం తీరదం లెదు...

భగవంతుడు "కొరిక" కాడు....

కొరుకునే శక్తినిచ్చె, మీలోని చైతన్యం తానవుతాడు