Friday, April 10, 2009

ఏంచెయ్యను..? కదలలేను కదా..!




నేను..ఓ వీధి తలుపుని ..కొన్ని ఏళ్ళనుండి అదే ఇంటికి కాపలాగా ఉంటున్నా....
ఎన్నో చూసా... వీధి కొట్లాటలు..చిన్న పిల్లల ఆటలు..కాలుష్యం...ఎండా... వాన..ఎముకలు కొరికే చలి...పెళ్లి ఊరేగింపులు.. ఇంకా చావు మోతలు..చూసా...

ఈసారి ఊరిగేంపు ఇంటికొచ్చింది.. ఇంటికి కొత్త కోడలు వచ్చింది..

ఎంతో.. మంచి అమ్మాయి..
రోజూ ... కళ్ళాపి జల్లి ముగ్గులేసేది..ఇంటి అరుగు.. అందంగా ఊడ్చేది..
మొక్కల పాదులకు. నీళ్లు పోసేది..అతిధుల్ని..నాతో పాటు సాదరంగా ఆహ్వానించేది..చిన్న పాపలా నవ్వేది..
తను వచ్చినప్పుడే.. నాకు.. కొత్త... రంగులోచ్చాయ్..

కొన్నాళ్ళకే... ఇంట్లో నుండి..ఏడుపు వినిపించడం మొదలయింది..
వీధిలో అందరూ... గుస గుసలాడుకుంటే.. తెలిసింది.. కట్నం విషయం లో జరిగిన ...అపశ్రుతి..వలనే..
ఇంట్లో..ఈ కచేరి..ఆ ఆరున్నొక్కరాగం కూడానూ..అని..

మరి కొన్నాళ్ళకే చావు మోతలు కూడా.. వినపడ్డాయి..
ఆమె ఆత్మ హత్య చేసుకుందట.. చాలా భాదగా ..అనిపించింది..

మరో క్షణం ఉండ బుద్ధి కాలేదు..
వాళ్ళ మొహం చూడ బుద్ధి కాలేదు నాకు..

ఏంచెయ్యను..? కదలలేను కదా..!

ఆ దేవుడు...నా ఆర్తి విన్నాడో ఏమో..
ఇంతలో మరో వార్త..విన్నాను..
ఇంటికి ఇంకో కోడలు వస్తోందట..మరింత డబ్బుతో..!

మార్పులు చేయిస్తున్నారు ఇల్లు మరి కొంచెం గొప్పగా కనపడాలని....
నన్ను... తీసేస్తున్నారు..కొత్త కావలి.. కావాలి..అని..

చివరికి..ఓ పాత.. ఇనుప సామాన్ల కొట్టుకి. చేరాను..

అప్పుడు తెలిసింది..ఇక్కడ..అన్నీ..నాలాంటి..చరిత్ర..కలిగినవే కోకొల్లలు..గా ఉన్నాయని...

10 comments:

Ramki said...

Chaala baaga raasaru. excellent one.. Keep it up

అరుణ పప్పు said...

బాగా రాశారు, అభినందనలు.

బొల్లోజు బాబా said...

వస్తు కవిత్వం లో ఇంత ఘాఢత కలిగిన కవితను నేనింతవరకూ చదవలేదు.

అభినందనలు.

ఆత్రేయ said...

చాలా బాగా రాశారు అభినందనలు.

చైతన్య said...

its awesome!!
చాలా బాగా రాసారు... ఇంత లోతు భావమున్న కవిత చదివి చాలా కాలం అయింది...
నాకు బాగా నచ్చింది...
please keep writing more frequently...

బాబు said...

హృదయాన్ని తాకింది.

jaideep said...

very nice one! touching

పరిమళం said...

శివగారు , మనసుకి హత్తుకొనేలా ఉందండీ ...ప్రాణం లేని వస్తువుక్కూడా ఆలోచన కల్పించారు .

creativekurrodu said...

chaala baaga varninchaaru siva gaaru, memu mI abhimanulam ani garvinchela raasaaru..
marinta vivaranaatmaka dhorani lo mi gurivinda ginja untundani aashistoo..
Touching frend!

mI veerAbhimaani :)

Siva Cheruvu said...

;)

Siva Cheruvu