Tuesday, April 28, 2009

భగవంతుని కోరిక...!

మనం గుళ్ళో .. ఇంట్లో.. రోడ్డు మీద..అని చూడకుండా..ఎక్కడ పడితే.. అక్కడ. మనకేమైనా.. కావాలంటే. ..దేవుడిని..ప్రార్థిస్తాం...

అయితే.. భగవంతునికేమైనా.. కావాలంటే.. ఎవరిని ప్రార్థిస్తాడు..?అసలు..ఆయనకీ..కోరికలు ఉంటాయా ..?
....
....
....
....
....

నా అనుభవ పూర్వకం గా..కోరికలు..మనకే ఉంటాయి...

పరిస్థితులను బట్టి..
ఆయనకు మనమే....మనకున్న ఆలోచనలని.. ఆ కోరికలను..కలలను..ఆపాదిస్తాం..

దేవుడు..లేక దేవత..మన నమ్మకాలకు..రూపాలు..

మంత్ర పుష్పం లో చెప్పినట్టు.. " అంతర్ భహిర్థ్యతత్ సర్వం వ్యాప్త్య నారాయణ స్థితః " ఆ భగవంతుడు.. లోపల బయట అంతటా వ్యాపించి వున్నాడు..

అప్పుడు లోపల వున్న ఆయన... కోరికలు..మన ద్వారా బయటకు వస్తాయి కదా..
నర నారాయణులు.. చూపులకు.. రెండు రూపాలు కాని.. ఆత్మ స్వరూపం ఒకటే కదా...!

అంటే.. అహం బ్రహ్మాస్మి..భగవంతుని కోరిక నా కోరిక ఒకటే (నా ద్వారా బయటకు. వస్తోంది..)నాకు కోర్కెలు లేవు.. అన్ని ఆయనవే...

ఇది కేవలం నా అభిప్రాయం..ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని కాదు..
స్నేహితులు.. మీరూ ఓ రెండు మాటలు.. చెపుతారని.. మీతో ఇలా పంచుకునే ప్రయత్నం...

"స్పర్ధయేన లభతే విద్యా.."

అయితే.. నా ఈ ..ఆద్యాత్మిక పథంలో.. నాతో.. ఇదే ఆలోచన కొనసాగుతుందని నేనూ చెప్పలేను.. ఇదీ... శాశ్వతం కాదు..రెండేళ్ళ క్రితం నేనూ .. ఇప్పటి నేనూ ఒకటి కాదు కదా...ముందడుగు వేస్తూనే వుంటాను..

ధన్యవాదాలు...
శివ చెరువు

Friday, April 10, 2009

ఏంచెయ్యను..? కదలలేను కదా..!
నేను..ఓ వీధి తలుపుని ..కొన్ని ఏళ్ళనుండి అదే ఇంటికి కాపలాగా ఉంటున్నా....
ఎన్నో చూసా... వీధి కొట్లాటలు..చిన్న పిల్లల ఆటలు..కాలుష్యం...ఎండా... వాన..ఎముకలు కొరికే చలి...పెళ్లి ఊరేగింపులు.. ఇంకా చావు మోతలు..చూసా...

ఈసారి ఊరిగేంపు ఇంటికొచ్చింది.. ఇంటికి కొత్త కోడలు వచ్చింది..

ఎంతో.. మంచి అమ్మాయి..
రోజూ ... కళ్ళాపి జల్లి ముగ్గులేసేది..ఇంటి అరుగు.. అందంగా ఊడ్చేది..
మొక్కల పాదులకు. నీళ్లు పోసేది..అతిధుల్ని..నాతో పాటు సాదరంగా ఆహ్వానించేది..చిన్న పాపలా నవ్వేది..
తను వచ్చినప్పుడే.. నాకు.. కొత్త... రంగులోచ్చాయ్..

కొన్నాళ్ళకే... ఇంట్లో నుండి..ఏడుపు వినిపించడం మొదలయింది..
వీధిలో అందరూ... గుస గుసలాడుకుంటే.. తెలిసింది.. కట్నం విషయం లో జరిగిన ...అపశ్రుతి..వలనే..
ఇంట్లో..ఈ కచేరి..ఆ ఆరున్నొక్కరాగం కూడానూ..అని..

మరి కొన్నాళ్ళకే చావు మోతలు కూడా.. వినపడ్డాయి..
ఆమె ఆత్మ హత్య చేసుకుందట.. చాలా భాదగా ..అనిపించింది..

మరో క్షణం ఉండ బుద్ధి కాలేదు..
వాళ్ళ మొహం చూడ బుద్ధి కాలేదు నాకు..

ఏంచెయ్యను..? కదలలేను కదా..!

ఆ దేవుడు...నా ఆర్తి విన్నాడో ఏమో..
ఇంతలో మరో వార్త..విన్నాను..
ఇంటికి ఇంకో కోడలు వస్తోందట..మరింత డబ్బుతో..!

మార్పులు చేయిస్తున్నారు ఇల్లు మరి కొంచెం గొప్పగా కనపడాలని....
నన్ను... తీసేస్తున్నారు..కొత్త కావలి.. కావాలి..అని..

చివరికి..ఓ పాత.. ఇనుప సామాన్ల కొట్టుకి. చేరాను..

అప్పుడు తెలిసింది..ఇక్కడ..అన్నీ..నాలాంటి..చరిత్ర..కలిగినవే కోకొల్లలు..గా ఉన్నాయని...