Sunday, March 29, 2009

నాకే ఎందుకిలా..అవుతోంది..?

చిన్నప్పటినుండి... చూస్తున్నా..నాకే ఎందుకిలా..అవుతోంది..?

సమయానికి డబ్బులు దొరకవు,
నా ఆరోగ్యం బాగోదు,
నన్నందరూ చిన్నగా చూస్తారు,
స్నేహితులు లేరు,
నాకిష్టమైన వాళ్లు.. ఎప్పుడూ నాకు దూరమై పోతుంటారు,
నా మీద అధికారం చలయించడానికి చూస్తారు,
వాళ్ల పని అయ్యే వరకే నన్ను పట్టించుకుంటారు..
ఇలా .... ఇలా.... ఇలా.... నూట పాతిక ...

నిజం గా ఎందుకిలా..అవుతోంది..?

ఎందుకంటే .. నేనేది చూస్తే నాకదే కనపడుతుంది..నన్ను నేను ఎలా వూహించుకుంటే నేనదే అవుతాను..కాబట్టి..
ఎందుకంటే .. నాతో నేను లేను కాబట్టి...నేను ఆనందం గా లేను కాబట్టి..
ఎందుకంటే.. నా ప్రపంచం కాబట్టి.. నా చుట్టూ ప్రపంచాన్ని ఇలా ... నేను నిర్మించుకున్నాను కాబట్టి.. అక్కడే ...జీవిస్తున్నాను...కాబట్టి..ఇలా వుంది... ఇలా అవుతోంది..
ఎందుకంటే.. నేను ఇంతే..అని నేను నమ్ముతునన్ను కాబట్టి..
ఎందుకంటే..నన్ను నేను..ఈవిధం గా తయారు చేసుకున్నాను కాబట్టి...
ఎందుకంటే.!ఎందుకంటే..!ఎందుకంటే...!
ఇలా .... ఇలా.... ఇలా.... ఇక్కడ కూడా....నూట పాతిక ...
కావలసింది సమస్య పై మరింత... చర్చ వివరణ కాదు కదా..
కావలసింది ఎలా ? అనేదే.. ఇక్కడ అవసరం

దీనికి పరిష్కారం చాల సులువు..
నాకు మార్పు కావాలి అంటే..నేను మారాలి..
నన్ను నేను నమ్మాలి..

10 comments:

 1. శివ గారు, చాలా బాగా చెప్పారు కానీ,
  ఇది మనం తయారు చెసుకున్నది కాదు మనకి ప్రాఫ్తించింది అంతే,
  "అవసరం కోసం అన్నీ, అన్నిటి కోసం ఒక అవసరం"
  ఇదే జరుగుతుంది, అన్నిటిని ఒకే దృష్టి తో చూడడం మంచిది కాదు
  మనం మారినంత మాత్రాన మన సమస్యలు మారవు, వాటీ పరిష్కార మార్గాలలొ చర్చలు కూడ అవసరం అవుతుంటయి, దేనిని విస్మరించలేము కదా. నీకు అవగాహన ఉంటేనె ఏమి చేయలి అన్న ఆలోచన వస్తుంది. నేను మారాలి అంటే సరిపొదు కదా. ఇలా ఆలొచిస్తే మన ప్రతీ పనికి ఆటంకాలే ఎదురవుతాయి.దాని వల్ల యే లాభము ఉండదు కదా! :)

  ReplyDelete
 2. చాలా బాగా చెప్పారు శివ గారు....
  మనిషి మారితే... ఆలోచన మారుతుంది... తన మీద తనకి నమ్మకం ఉన్న వ్యక్తి ఎలాంటి సమస్యనైనా తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు.
  తన మీద తనకి నమ్మకం ఉంటె... ఇతరులకి కూడా అతనిపై నమ్మకం కలుగుతుంది.
  తనని తను గౌరవించుకుంటే... ఇతరుకు కుడా గౌరవిస్తారు.
  చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించకపోతే... అవతలి వారు మనల్ని వాడుకుని వదిలేసారు అన్న ఫీలింగ్ పోతుంది.
  ఇలా ఇక్కడ కుడా నూట పాతిక ఉన్నాయి :)

  ReplyDelete
 3. Every thing is in our mind only.
  The way u think the way u act. Simple boss!

  ReplyDelete
 4. నాకు మార్పు కావాలి అంటే..నేను మారాలి..
  నన్ను నేను నమ్మాలి..
  బాగుంది... :)

  ReplyDelete
 5. "దీనికి పరిష్కారం చాల సులువు.." అదంత సులువు కాదేమో శివ గారూ !
  nice post!

  ReplyDelete
 6. nannu nenu nammali anadam kontavaraku baane untundi, adi mana pai manaki vishvasanni penchutundi tappinchi asalu samasya parishkaaraniki maargam chupistundaa? manalni manam nammali, alane inkoalni kuda nammalsina paristitulu untayi, anukokunda emaina taaru maaraite appudu mana nammakam pani cheyadu avasaram teeradaaniki. Alochinchandi siva garu.

  ReplyDelete
 7. అగ్నాత .. గారు...ప్రాప్థం మన కర్మలను బట్టి యెర్పడేదే... మన ప్రవర్థన.. మన ఆలొచనా.. మారనంతవరకు..ఉన్న పరిస్థితే కొన సాగుతుందికదా..

  రెండు మూడు .. విషయాలు జొడించినందుకు చైతన్య గారికి ధన్యవాదాలు..

  సాహితి..జయదీప్ .. విజయ్ గార్లకు.. ధన్యవాదాలు..

  పరిమళం గారు... "దీనికి పరిష్కారం చాల సులువు.." నిజమే.. కాని.."మార్పు.. రావడం కష్టం.." బహుశా మీరన్నది..మార్పు రావడం గురించేననుకుంటాను..

  Blacky..గారికి ...

  బాగా చెప్పారు..

  ఒక సమస్య మనలని..తాకుతొందంటే...దానిలొ మన పాత్ర ఉంది అని మా స్నేహితుడొకాయన ... అంటూ ఉంటారు..
  మన మీద ఉండె నమ్మకం ముందు.. మన పొరపాట్లను.. సరిదిద్దుకునే.. అవకాశం కల్పిస్తుంది... ధైర్యం ఇస్తుంది..

  "షట్బాగంతు మనుష్యానాం సప్తమం దైవ చింతనం..."

  పైన భగవంతుని దయ..:)

  ReplyDelete
 8. siva gaaru dhanyavadamulu..
  Ee madhya blogu lokamlo hadavidi raatalu ekkuvainavi, ikkada andaru yedo cheppedam ani prayatninchi mottam nimpesaaru kaani, asalu vishayam yemi ledu. meeku nacchindi andariki nachali antey kudaradu kada! :)

  ReplyDelete
 9. Krish gaaru,

  Meeru sarigga chepparu...

  Aithe... nenu maatram naa abhiprayanni.. maatrame ikkada velladi chesaanu... anthe..

  verevvarini .. ibbandhi pette uddesam tho kaadu..

  Ayinaa.. blogu unnadi ... emanipiste... adhi .. naluguriki...cheppi... vaallanundi...kooda telusokovadaanike kadaa...

  Siva Cheruvu :)

  ReplyDelete