Friday, March 20, 2009

చిన్ననాటి నేస్తం...నా వయసు.. 10, 12 సంవత్సరాలు..

వేసవి
సెలవల..సమయం..లో ..నాకో నేస్తం.. దొరికాడు..

...ఒకటే.. ఆటలు.. అడిగేవాళ్ళు.. లేరని..బాగా తిరిగే వాళ్ళం. చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేద్దామని..ప్రయత్నాలు కూడా చేసాం...

పొద్దున్న ... పోతే ... వీధుల వెంబడి.. అలా నడుచుకుంటూ ... గంటలు గంటలు.. ఎండల్లో.. పండగ రోజుల్లా...
గడిపాం..

వాళ్ల ఇంట్లో వాళ్ళకి నేను పరిచయం.. అయ్యాను..

నేను .. ఎంతలా అతడి.. స్నేహాన్ని... కోరుకున్నానంటే.. మా ఇంటినే ... మరిచేంతగా..ఎప్పుడూ తనతోనే వుండే వాడిని...

అప్పుడప్పుడూ.. బయట.. చిరు తిళ్ళు.. తినేవాళ్ళం.. ఎప్పుడూ డబ్బులు తనే కట్టేవాడు..
డబ్బులెక్కడివంటే ... దాచుకున్నవి వున్నాయని చెప్పి .. సర్ది చెప్పేవాడు..

రాను రాను అతని కర్చులు పెరిగాయి... వాళ్ల ఇంట్లో.. వాళ్లు.. నన్ను చూసే విధానం మారడం మొదలయింది...
దీనికంతకీ .. కేవలం..రెండు .. మూడు వారల సమయం పట్టిందంతే...

ఓ రోజు ... వాళ్ల అమ్మ గారు.. ఇంటి ముందే నిలబెట్టి.. వాళ్ల అబ్బాయిని .. నేనే ...తప్పుడు పనులు చేయిస్తున్నానని.. ఇకపై రావద్దని.. అన్నారు..

అప్పుడు తెలిసింది నాకు.. ఆ అబ్బాయి.. వాళ్ల..ఇంట్లో..దేవుడి దగ్గర దాచిన ..డబ్బులు ... పట్టుకోచ్చేసేవాడని..

ఇక ..నిశబ్దంగా.. నిష్క్రమించడం.. నా వంతయింది..

తరువాత..ఉద్దేశ పూర్వకం గా అటువైపు వెళ్ళలేదు..ఒకవేళ ..కనపడినపడినా... పెద్దగా పలకరింపులు లేవు..

నాలో.. అహం..మళ్లీ.. నన్ను అతడి వైపు చూడనీకుండా చేసింది..

అయినా ఎందుకో... ఇప్పటికీ గర్వం గా చెప్పుకోవాలనిపిస్తుంది..వాడు నా స్నేహితుడని..

ఎందుకంటే...

నేను... ఒంటరి కానని.. నాతో స్నేహం చేయడానికి..
ప్రపంచం చేతులు చాచి ఆహ్వానిస్తున్నదని..

నాకు.. చెప్పిన.. మొదటి స్నేహితుడు..అతడే..

14 comments:

చైతన్య said...
This comment has been removed by the author.
చైతన్య said...
This comment has been removed by the author.
చైతన్య said...

చిన్ననాటి స్నేహాలు మరువలేనివి.

10, 12 సంవత్సరాల వయసులో మీకు పార్ట్ టైం జాబు చేయాలనే ఆలోచన రావాటం చాలా గ్రేట్!

Ramana said...

Nice post boss.......
Keep it up............
thanx for remembering childhooddays.....

lakshmi said...

nice memories!

sahiti said...

memories ni gurtuchesaru, bagundi mee post...........

విజయ్ said...

ఆ మొదటి మిత్రుడు ఇప్పుడేమి చేస్తున్నాడు? ఎలా ఉన్నాడూ? వివరాలేమైనా తెలుసా...? తెలిస్తే ఒక్కసారి అతన్ని కలవండి... ఆ రోజుల్ని అతనితో కలిపి గుర్తుకు చేసుకోండి... బాగుంటుంది కదూ... :)

maharshi said...

ha ha ha bagundi!

పరిమళం said...

శివ గారు ,చిన్ననాటి స్నేహం గుర్తొచ్చి మనసు భారమైపోయింది .అప్పట్లో ఇప్పుడున్నంత కమ్యునికేషన్ లేక దూరమయ్యాం .ధన్యవాదాలు .

pradeep said...

pls dont get aggressive or repulsive over any relation. Every human is single in this huge world, people come and go,but u need to be there always for yourself. All the best! :)

kk said...

nice memories!

Anonymous said...

Aa paata gnapakaalu adbhutamandi..

krish said...

శివ గారు, ఆ వయసులో మీరు సమాధానం చెప్పుకోలెకపోయారేమో కాని నిజానికి అందులో మీ తప్పు కూడా కొంత ఉంది.ఆ వయసులో మీకు తెలిసుండక పోవచ్చు. చిన్ననాటి గుర్తులు మధురంగానే ఉంటాయి. వాటిని గుర్తుంచుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నను. మాకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .
All the best! :)

చింతకాయల 'కవి ' said...

చిన్ననాటి గుర్తులు,
చిలిపి తగాదాలు,
కోతి చేష్టలు,
అన్నీ గుర్తుచేసినందుకు.
Thanks :)