Friday, March 6, 2009

చివరికి..!కోటలు కట్టొచ్చని .. మాటల్లో..
కర్చు కావని.. కలల్లో..
దొరలిపోతున్న.. కాలం ముందు..
దిష్టి బొమ్మలా నిలబెట్టేసిన.. నా ఆశయాలు.

మనుసు మళ్ళి....
మారతానేమో నని..ప్రాణం పోస్తానేమో నని..
ఎదురు చూస్తూనే వున్నై..ఏళ్ళ తరబడి..

ఆకర్షణలు...
సంఘం.. సందిగ్దత..
భంధాలూ.. బరువు బాధ్యతలు..
ఇలా .. ఏవేవో.. కారణాలపేర..
వాటి సమయం..దరి దాపుల్లో.. లేదని.. చెప్పేసాను..దూరంగా వుంచేశాను.

కాలం చక్రమై తిరిగింది..
వత్సరాలు గడిచినై..

భ్రమణం లో.. అవి.. తమ వునికిని మర్చిపోయినై..

ఇన్నాళ్ళకి..!

లోచనాచరణల మధ్య. అంతరాలను.. స్పష్టం గా చూస్తూ....
పశ్చాత్తాపం చెందిన..నా.. మస్తిష్క..తరంగాలు..
సమాధానం లేక... సిగ్గు పడ్డాయి..

క్షమించమని .. ఎవరినడగాలో తెలీక..
నను వదిలి.. పోలేక..

చివరికి..

ప్రశ్నార్ధకం...అయ్యాయి..!

16 comments:

చిలమకూరు విజయమోహన్ said...

బాగుంది మీ కవిత

Nayani Aditya Madhav said...

gurivinda ginja gaaru..
bagundi mI kavita,
indulo kavitalena, inka vere yemi undava???
atyutsaaham aapukoleka adiganante..
yemi anukokandi!
carry on!

sahiti said...

mee kavita chaala bagundi
mee antarangalalo edo teliyani goppa feel daagi undi.
carry on....

ఉష said...

ఇప్పటికీ మించిపోయింది లేదు, ఆలోచనలు నిత్యం పారే జలధులు, ఆచరణ సజీవచిత్రం. వాటికి అంతం లేదు. అలాగే మీరెపుడు ఆరంభించారన్నదీ ముఖ్యం కాదు. కార్యాచరణ, సంకల్పం మాత్రం చాలు. ఇక సాధనలోకి పయనం సాగించండి. వితరణ, తర్కం కన్నా వున్న సమయాన్ని అనువైన విధంగా సాఫల్యం చేసుకోండి మరి. స్వానుభవం మీద ఇస్తున్న సలహా ఇది.

ప్రేమికుడు said...

శివ గారూ ఆశయాలున్నంత మాత్రాన సరి పోదు, ఆచరణ కావాలి. కొందరికి ఆశయాలతోనే జీవితం వెళ్లిపోతుంది. మరి కొందరు ఆచరించి చూపిస్తారు. మీరు ఏకోవలోకి రావాలను కుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఇప్పటికైనా సమయం మించిపోతోందని గుర్తించారు. అభినందనీయం. :)

RAmki said...

Andaru chepparu, mee kavithalo edo feel undani..
Naaku nijame anipisthondi...

Mee aasayalu emito naatho share chesukunte, nenu meetho undi avi neraveretatlu choosta...

marinni kavithalo mee kalam lo nunchi ravaalani eduruchoostu..

Mee Abhimani
Ramki

పరిమళం said...

శివ గారూ! బాగుంది మీ కవిత.అభినందనలు.

Jaideep said...

work for a cause and not for applause then you can reach your goal without any question marks in your life!..
very nice :)

రమణ said...

'ఈ జీవితం లో చివరికి మిగిలేది ప్రశ్నార్ధకం' అని బాగా చెప్పారు.

ఆత్రేయ said...

చాలా బాగుంది శివ గారు... చాలా లేటుగా చూశాను.

బ్రతుకు పయనంలో..
ప్రతి కూడల్లో, ప్రతి మలుపులో..
అలసి ఆగిన ప్రతి అరుగు మీద.
ఆప్యాయంగా ఆహ్వానిస్తాయి .. ఆ ప్రశ్నలు..

కాలం దొర్లినా.. గమ్యాలు దాటినా..
బంధాలు వీడినా.. పంతాలు తీరినా ..
ఓడి నిలిచిన ప్రతి తరుణంలోనూ..
ఆప్యాయంగా ఆహ్వానిస్తాయి.. అవే ప్రశ్నలు..

ఎద్దేవా చేయడానికో..
ఓడావని ఎగతాళిచేయడానికో
ఓర్పేవయిందని అడగడానికో కాదు..

ఎదురీదే సాహసముంటే
సముద్రమైనా పిల్ల కాలవేననీ
పరుగులు తీసే సత్తా ఉంటే
నీ పాదాల కిందే ప్రపంచమంతా అనీ

ఊతమివ్వడానికే..
నీ ఊహ నిజం చెయ్యడానికే...
తిరిగి నీ పయనం సాగడానికే..
చివరికి గమ్యం చేరడానికే !!

కొత్త పాళీ said...

good show.

Anonymous said...

very nice
carry on! :)

Blacky said...

Feels good...... :)

Ramesh P said...

ఆలొచన ఆచరణ మధ్య అంత అంతరాలు ఉన్నప్పుడు సిగ్గు ఎందుకండి.
మనం అప్పుడు పని చేయల, ఇప్పుడు చెయటంలేదు అంతే.. :-)

krish said...

శివ గారూ ! బాగుంది మీ కవిత చివరికి..! :)

Anonymous said...

బాగుంది మీ కవిత!
మనం ఒక పని మొదలు పెడితే చివరికి ఏదొ ఒకటి అవుతుంది,ముందు మీ ప్రయత్నం మీరు చేయండి జరగాల్సింది జరుగుతుంది చివరికి. :)