Sunday, March 29, 2009

నాకే ఎందుకిలా..అవుతోంది..?

చిన్నప్పటినుండి... చూస్తున్నా..నాకే ఎందుకిలా..అవుతోంది..?

సమయానికి డబ్బులు దొరకవు,
నా ఆరోగ్యం బాగోదు,
నన్నందరూ చిన్నగా చూస్తారు,
స్నేహితులు లేరు,
నాకిష్టమైన వాళ్లు.. ఎప్పుడూ నాకు దూరమై పోతుంటారు,
నా మీద అధికారం చలయించడానికి చూస్తారు,
వాళ్ల పని అయ్యే వరకే నన్ను పట్టించుకుంటారు..
ఇలా .... ఇలా.... ఇలా.... నూట పాతిక ...

నిజం గా ఎందుకిలా..అవుతోంది..?

ఎందుకంటే .. నేనేది చూస్తే నాకదే కనపడుతుంది..నన్ను నేను ఎలా వూహించుకుంటే నేనదే అవుతాను..కాబట్టి..
ఎందుకంటే .. నాతో నేను లేను కాబట్టి...నేను ఆనందం గా లేను కాబట్టి..
ఎందుకంటే.. నా ప్రపంచం కాబట్టి.. నా చుట్టూ ప్రపంచాన్ని ఇలా ... నేను నిర్మించుకున్నాను కాబట్టి.. అక్కడే ...జీవిస్తున్నాను...కాబట్టి..ఇలా వుంది... ఇలా అవుతోంది..
ఎందుకంటే.. నేను ఇంతే..అని నేను నమ్ముతునన్ను కాబట్టి..
ఎందుకంటే..నన్ను నేను..ఈవిధం గా తయారు చేసుకున్నాను కాబట్టి...
ఎందుకంటే.!ఎందుకంటే..!ఎందుకంటే...!
ఇలా .... ఇలా.... ఇలా.... ఇక్కడ కూడా....నూట పాతిక ...
కావలసింది సమస్య పై మరింత... చర్చ వివరణ కాదు కదా..
కావలసింది ఎలా ? అనేదే.. ఇక్కడ అవసరం

దీనికి పరిష్కారం చాల సులువు..
నాకు మార్పు కావాలి అంటే..నేను మారాలి..
నన్ను నేను నమ్మాలి..

Thursday, March 26, 2009

మళ్ళీ... మళ్ళీ...
ఆశల నందన వనంలో ....
హృదయపు ఆనంద తాండవం...

ఉన్నట్టుండి
.
.
.
.


తన సందడి.. ఆపేస్తోంది..

ఏదో ఎద్దడి..

గుండెల నిండుగా ... భయమనే..నిప్పుల కుంపటి..

లాభార్జన లెక్కలు..
పగిలి పోయిన ... అద్దాలు ...అతుకులు
క్షణికావేశాలు ...కోల్పోయానని పలు..
కాదని.. అవునని..కమ్మేసిన.. ఊగిసలాటలు....

ముగిసిన రోజున..
అలసిన ఒంటిని .... దుప్పటిలా కప్పేసిన నిద్దుర..

మళ్ళీ... మళ్ళీ...
అదే.. అదే..

మళ్ళీ...? మళ్ళీ...?
అదే..? అదే.. ?

ఆవ్రుతమౌతోంది.. ?

ఆవ్రుతమౌతోంది.. !

Friday, March 20, 2009

చిన్ననాటి నేస్తం...నా వయసు.. 10, 12 సంవత్సరాలు..

వేసవి
సెలవల..సమయం..లో ..నాకో నేస్తం.. దొరికాడు..

...ఒకటే.. ఆటలు.. అడిగేవాళ్ళు.. లేరని..బాగా తిరిగే వాళ్ళం. చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేద్దామని..ప్రయత్నాలు కూడా చేసాం...

పొద్దున్న ... పోతే ... వీధుల వెంబడి.. అలా నడుచుకుంటూ ... గంటలు గంటలు.. ఎండల్లో.. పండగ రోజుల్లా...
గడిపాం..

వాళ్ల ఇంట్లో వాళ్ళకి నేను పరిచయం.. అయ్యాను..

నేను .. ఎంతలా అతడి.. స్నేహాన్ని... కోరుకున్నానంటే.. మా ఇంటినే ... మరిచేంతగా..ఎప్పుడూ తనతోనే వుండే వాడిని...

అప్పుడప్పుడూ.. బయట.. చిరు తిళ్ళు.. తినేవాళ్ళం.. ఎప్పుడూ డబ్బులు తనే కట్టేవాడు..
డబ్బులెక్కడివంటే ... దాచుకున్నవి వున్నాయని చెప్పి .. సర్ది చెప్పేవాడు..

రాను రాను అతని కర్చులు పెరిగాయి... వాళ్ల ఇంట్లో.. వాళ్లు.. నన్ను చూసే విధానం మారడం మొదలయింది...
దీనికంతకీ .. కేవలం..రెండు .. మూడు వారల సమయం పట్టిందంతే...

ఓ రోజు ... వాళ్ల అమ్మ గారు.. ఇంటి ముందే నిలబెట్టి.. వాళ్ల అబ్బాయిని .. నేనే ...తప్పుడు పనులు చేయిస్తున్నానని.. ఇకపై రావద్దని.. అన్నారు..

అప్పుడు తెలిసింది నాకు.. ఆ అబ్బాయి.. వాళ్ల..ఇంట్లో..దేవుడి దగ్గర దాచిన ..డబ్బులు ... పట్టుకోచ్చేసేవాడని..

ఇక ..నిశబ్దంగా.. నిష్క్రమించడం.. నా వంతయింది..

తరువాత..ఉద్దేశ పూర్వకం గా అటువైపు వెళ్ళలేదు..ఒకవేళ ..కనపడినపడినా... పెద్దగా పలకరింపులు లేవు..

నాలో.. అహం..మళ్లీ.. నన్ను అతడి వైపు చూడనీకుండా చేసింది..

అయినా ఎందుకో... ఇప్పటికీ గర్వం గా చెప్పుకోవాలనిపిస్తుంది..వాడు నా స్నేహితుడని..

ఎందుకంటే...

నేను... ఒంటరి కానని.. నాతో స్నేహం చేయడానికి..
ప్రపంచం చేతులు చాచి ఆహ్వానిస్తున్నదని..

నాకు.. చెప్పిన.. మొదటి స్నేహితుడు..అతడే..

Friday, March 6, 2009

చివరికి..!కోటలు కట్టొచ్చని .. మాటల్లో..
కర్చు కావని.. కలల్లో..
దొరలిపోతున్న.. కాలం ముందు..
దిష్టి బొమ్మలా నిలబెట్టేసిన.. నా ఆశయాలు.

మనుసు మళ్ళి....
మారతానేమో నని..ప్రాణం పోస్తానేమో నని..
ఎదురు చూస్తూనే వున్నై..ఏళ్ళ తరబడి..

ఆకర్షణలు...
సంఘం.. సందిగ్దత..
భంధాలూ.. బరువు బాధ్యతలు..
ఇలా .. ఏవేవో.. కారణాలపేర..
వాటి సమయం..దరి దాపుల్లో.. లేదని.. చెప్పేసాను..దూరంగా వుంచేశాను.

కాలం చక్రమై తిరిగింది..
వత్సరాలు గడిచినై..

భ్రమణం లో.. అవి.. తమ వునికిని మర్చిపోయినై..

ఇన్నాళ్ళకి..!

లోచనాచరణల మధ్య. అంతరాలను.. స్పష్టం గా చూస్తూ....
పశ్చాత్తాపం చెందిన..నా.. మస్తిష్క..తరంగాలు..
సమాధానం లేక... సిగ్గు పడ్డాయి..

క్షమించమని .. ఎవరినడగాలో తెలీక..
నను వదిలి.. పోలేక..

చివరికి..

ప్రశ్నార్ధకం...అయ్యాయి..!