Wednesday, February 11, 2009

ఏదోటి..!

అర్ధమవదుగా నీ అంతరార్ధం..
అంతో..!
ఇంతో...!
అనుకుందామన్నా..! ఏదోటి..!

పెదవిప్పవు కనీసం..
రెప్ప పాటుకు..
అందామన్నా..! ఏదోటి..!

ఎంత కాలం ...
ఇలా.. !
ఇలా..!
వసంతం వాకిట్లో..

అనుమతిస్తావా..?
అతిధిలా ... నన్ను..కనీసం..!

చేరనిస్తావా..?
చేరువగా నైనా ...నా..ఈ.. గీతం..!

21 comments:

Anonymous said...

చదివిన కాణ్ణించి పెయ్యలో బుచికి బుచికి . కుక్షిలో జజ్జినకరి.

చింతకాయల 'కవి ' said...

బాగుంది మీ కవిత కాని ..
అర్థంకాలేదు. నా లాంటి చింతకాయల(మాకు చింతలు ఎక్కువలెండి) కవులకి కొంచం కష్టం గా ఉంది..
ఎదో ఫీల్ ఉంది మీ కవితల్లొ. Nice! :-)

Telugu Fantasy said...

మీకవితలో ఏదో ఆవేదన ఉంది. అదే, ఏమిటో తెలియడం లేదు.

పరిమళం said...

శివ గారూ !కవిత బావుంది ,కాని స్పష్టత లోపించింది .అంతరార్ధం అనేకంటే ,అంతరంగం అంటే బావుండేదేమో అనిపించింది .చిన్న మార్పులతో మీ భావాల్ని ఇంకా అందంగా చెప్పొచ్చు .అన్యధా భావించరని భావిస్తున్నాను .

ప్రేమికుడు said...

శివ గారూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసారు. బాగుంది. కానీ పరిమళం గారన్నట్టు స్పష్టత లోపించిందండీ. మీ కవిత గురించి ఇదివరకు నేస్తం గారు కూడా ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చినట్టు గుర్తు. ఇంకొంచం ఆలోచించి రాయండి. నేను ఇలా సభా ముఖంగా మిమ్మల్ని తప్పు పడు తున్నందుకు మన్నించండి. కానీ మీరు మరింత తపనతో రాస్తే మీనుంచి చాలా మంచి కవిత్వం వస్తుంది. అందుకే ఇలా చెప్పక తప్పటం లేదు. మీ భావం పామరులకు కూడా అర్ధమయ్యేటట్టుండాలని ఆశిస్తున్నాను. మీ ప్రేమికుడు :)

Nayani Aditya Madhav said...

నేను మీ అభిమానిని..

కవిత బాగుంది చాలా..
కాని నాకు అర్థం కాలా..
ప్రయత్నించా మళ్లా..
ఇంక నా వల్ల కాలా..

మీ నుంచి ఇంకా మంచి కవితల వస్తాయి..
ఆ నమ్మకం నాకుంది.. All the best! :-)

Jaidev Kala said...

బాగుంది మీ కవిత. అర్థమైతే (నాకు మాత్రమే) ఇంకా బాగుండేది.
పర్వాలేదు 'ఏదోటి'! :)

maharshi said...

శివ గారూ, కవితలు చాలా బాగున్నాయి,బాగుంది మీ బ్లాగు.మీ ప్రొఫైల్ లొని ఫొటొ తప్ప.ఏమీ అనుకొకండి, నాకు కొంచం నోటి దురద అంతె!

మహర్షి

Sivaganga said...

nice but no clarity.
hope you wouldnt mind! :-)

Kalyan J said...

nice one!

Anonymous said...

మిమ్మల్ని ఏదో విషయం బాగా బాధపెట్టినట్టుంది.
మీ కవిత బాగుంది.

రమణ G

Maheshwari said...

శివ గారూ, కవితలు బాగున్నాయి.

monkey2man said...

గురివింద గింజ గారు..
నలుపు ఎక్కువ ఎరుపు తక్కువ గా కనిపిస్తుంది..
పర్లెదు, ఒకొసారి మన కళ్ళు మనల్ని మోసం చెస్తాయి.
మీరు కుమ్మెయండంతే..

Girish said...

cool man!

telugodu said...

తికమకగా ఉన్నా బాగుంది.
అందుకోండి ఈ తెలుగోడి అభినందనలు

Kumar chandra said...

nice one boss!

శివ చెరువు said...

ధన్య వాదాలు.. స్నేహితులు.. మన మంచి..కోరుకునేవారు..మన లోపాలను.. సరి దిద్దే .. వారు...

తెలుగుకళ said...

ప్రేమ సందేశాల మధ్య ఈ తుపాకులేమీటండీ బాబూ........
మీ బ్లాగుకి రావాలంటేనే భయమేస్తోంది.......

ramabhadra murthy said...

బాగుంది మీ కవిత, మీ భావం అర్థంకాలేదు. బ్లాగు పర్వాలేదు. కొంచం కలర్ తో పాటు పాట కూడా మారిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఏమీ అనుకొకండి. :)

sitalakshmi said...

kavi ardha tatparyalatho kavitha rayanakkarledu.... ardham chesukune hrudayanni batti untundi... ravindruni kavithalu kuda spandinche manasuni batti ardam avutayi.....chala bagunnayi mee kavithalu...


expecting many....

Blacky said...

Cool man!