Tuesday, February 3, 2009

ఆరాటం.. !

ఎదుటే నిలబడి చెబుతున్నా..
"నేనిక రానని .." నే.. గురుతుకు రానని...!

అనిపిస్తున్నా... ప్రతి నిముషం..
దగ్ధం... చేయాలని.. దహించే.. నీ జ్ఞాపకాలని..!

వినదు కదా .. హృదయం ..
ఇంతైనా....?

ఇంకా ఏదో .. ఆరాటం..
తిరిగిరాని .. ఆ క్షణాల కోసం..

ఇలా..! మిగిలి ఉంటోంది .. !
మౌనం గా ..!
ఎడారి.. ఎండమావి.. కధలా..!

నిశ్శబ్దం గా...
నిశికి.. దగ్గరగా... !

9 comments:

  1. బాగుంది కాని మొదటి రెండు లైనులు నాకు కొంచెం అర్దం కాలేదండి..
    (ఎదుటే నిలబడి చెబుతున్నా..
    "నేనిక రానని .." నే.. గురుతుకు రానని...!)

    నేను ఇంక గురుతుకు రాను నీకు అని తను మీకు చెబుతుందా???
    మీ కవిత లో పదాలు బాగున్నాయి కాని అర్దం చేసుకునే శక్తే నాకు లేదనుకుంటా :)

    ReplyDelete
  2. నేస్తం గారికి .. నెనరులు..
    ఆ మొదటి లైన్ లో ... రాసిన పదాల అర్ధం.. ఇదుగోండి.. ఇక్కడ వ్రాస్తున్నాను..
    "నేనిక రానని .." - తను.. ఇక 'నేను రాను' అని నాతో చెపుతోంది
    నే.. గురుతుకు రానని...! - 'నేను తనకి' గురుతుకు రానని అంటోంది..

    శివ చెరువు

    ReplyDelete
  3. మీ కవిత కొంచం తికమకగా వుంది కాని బాగుంది. నాకు నచ్చింది. ఇంకా మంచి కవితలతొ అలరిస్తారని ఆశిస్తూ ...
    Keep Going!..

    ReplyDelete
  4. Siva, mee aalochanaa shakti amogham. Kaani konchem telugu padaalu ghatuga vaadu tunnaru. common man ki artham ayyela raaste inka baguntundi. Naalaanti valla kosam chaala suluvaga raastarani asisthu.

    Meeru inka manchi manchi kavithalu andinchalani manasaara korukuntunna.

    Mee kavitha sagaram lo maaku maaku manchi prayanam andistarani .... inthati tho selavu tesukuntunna

    Ramki
    (Telugu lo rayatam raaledu)

    ReplyDelete
  5. nice one..
    blog look is fine and attractive..
    Keep going..

    Sivaganga

    ReplyDelete
  6. 'Aaraatmlo' padi jeevana 'poraatanni' marchipokandem... :-)

    Aditya Madhav

    ReplyDelete
  7. చింతకాయల 'కవి 'February 9, 2009 at 4:44 AM

    బాగుంది మీ "ఆరాటం" , బ్లాగ్ లుక్ కూడా బాగుంది..

    ReplyDelete
  8. బాగుంది మీ కవిత.

    ReplyDelete