Monday, February 23, 2009

వైనం..

ఎదురెదురుగ నిలబడి...
గంటల పైబడి..
ముందుకు నడిపిన.. ఏకాంతములో ...

నీ కాలి వేలితో... నేలను రాసే.. లేఖలేవో..
వివరిస్తుంటే... ఎంత దూరమని..
మధ్యన ఉండే... ....
రెండడుగులది..

ఇంకా ... తడబాటుకు.. ఆగిపోతున్నా...!
ఏమైనా.. అంటావనో...
మరేమైనా.. అనుకుంటావనో ..

అయినా ...

కలిసి నిశ్శబ్దంలో ...
కలిసి పోతున్న వైనం..
మన మధ్య ...కొత్త కాదు కదా... అని..

వదిలిపోని..వదలలేని తనం.. గుర్తు చేసుకుని...
ఏమైనా ... పరవాలేదని..

చేసేస్తున్నా..
చేయందుకునే.. చొరవ..
మరింత.. చేరువౌదామని...

Wednesday, February 11, 2009

ఏదోటి..!

అర్ధమవదుగా నీ అంతరార్ధం..
అంతో..!
ఇంతో...!
అనుకుందామన్నా..! ఏదోటి..!

పెదవిప్పవు కనీసం..
రెప్ప పాటుకు..
అందామన్నా..! ఏదోటి..!

ఎంత కాలం ...
ఇలా.. !
ఇలా..!
వసంతం వాకిట్లో..

అనుమతిస్తావా..?
అతిధిలా ... నన్ను..కనీసం..!

చేరనిస్తావా..?
చేరువగా నైనా ...నా..ఈ.. గీతం..!

Tuesday, February 3, 2009

ఆరాటం.. !

ఎదుటే నిలబడి చెబుతున్నా..
"నేనిక రానని .." నే.. గురుతుకు రానని...!

అనిపిస్తున్నా... ప్రతి నిముషం..
దగ్ధం... చేయాలని.. దహించే.. నీ జ్ఞాపకాలని..!

వినదు కదా .. హృదయం ..
ఇంతైనా....?

ఇంకా ఏదో .. ఆరాటం..
తిరిగిరాని .. ఆ క్షణాల కోసం..

ఇలా..! మిగిలి ఉంటోంది .. !
మౌనం గా ..!
ఎడారి.. ఎండమావి.. కధలా..!

నిశ్శబ్దం గా...
నిశికి.. దగ్గరగా... !