Wednesday, January 28, 2009

వాన లో ...!

ఒక్కో చినుకు.. మేఘం తన దోసిలి లోంచి..
నా కోసమే .. జారవిడుస్తుందేమో ...!

సన్నని జల్లుల .. వాన స్పర్శ లా ...
అస్పష్టం గా .. ఎదురుగా ...ఆమె..!

కలం కలల్లోంచి ...
నా కోసమే మేలుకుంటుందేమో...!

ఎక్కడిదో.. ఈ వంపుల.. వైఖరి...
తీరే .. ఝరీ...!

ఎంచేస్తోందో మరి ..?
బంధిచేస్తోంది మరీ..!

విడుదలే వద్దనేలా ...
ధ్యాస నన్ను.. దాటుతుంటే.. కొత్త .. కొత్త గా....!

3 comments:

పరిమళం said...

శివ గారూ !మీ కవితలు బావున్నాయండీ .మీ బ్లాగ్ స్లైడ్ షో చాలా చాలా బావుందండీ !

Nayani Aditya Madhav said...

మీ కవితలకు వీరాభిమానిని నేను. ఎందుకొ మీకు తెలుసు నాకూ తెలుసు. మరిన్ని అద్భుతమైన కవితలతొ మీ నలుపు ని (గురివింద గింజ అన్నారుగా) కొంచం ఐనా తెలుపు చేసుకుంటారని ఆశిస్తూ.. మీరు అనుకున్నది సాధించాలని మనస్పూర్తిగా కొరుకుంటూ...

మీ
ఆదిత్య మాధవ్

monkey2man said...

శివ గారు: బాగుంది వాన లొని చినుకు లా జాలువారిన మీ కవిత, మీ స్లైడ్ షొ కూడా చాలా బాగుంది..