Tuesday, January 27, 2009

చిత్రం.. !

ఆలోచనల తెరలపై..
వేసి చూస్తున్నా... నా సొంత చలన చిత్రం..

ఎపుడో మొదలైంది.. ఏళ్ళ క్రితం
ఒంటరి గా నా ప్రయాణం...
నన్ను ...నేను.. వెతుక్కునే ప్రయత్నం...

సంవత్సరాల.. అన్వేషణ..
సమస్తం...!
భావోద్వేగాల భాగవతం...

చాలనిపించి ఎత్తిన ..
అవతారాల ప్రస్థానం ..
అలసి చేరుకున్నా..
మది విశ్రాంతి మందిరం..

అప్పుడు తెరుచు కున్నాయి...
అంతః చక్షువులు ..
ఆశ్చర్యం!

ఇదే.. నా మానస తీరం...
నేనిక్కడే.. ఉన్నాను..
నాలోనే ఉన్నాను..
కేవలం..!
మరచి పోయాను.....! నే వేరుగా లేనని..!

2 comments:

  1. చిత్రం..! అలసి సొలసిన మిత్రమా నిన్ను నువ్వు చూసుకున్నావా..! చెప్పిన విధానం బాగుంది.. :)

    ReplyDelete
  2. చింతకాయల 'కవి 'February 9, 2009 at 4:47 AM

    చిత్రం..
    అదొక విచిత్రం..
    మన బ్రతుకే ఓ చలన చిత్రం..

    బాగుంది మీ కవిత చిత్రం... :-)

    ReplyDelete