Wednesday, January 28, 2009

వాన లో ...!

ఒక్కో చినుకు.. మేఘం తన దోసిలి లోంచి..
నా కోసమే .. జారవిడుస్తుందేమో ...!

సన్నని జల్లుల .. వాన స్పర్శ లా ...
అస్పష్టం గా .. ఎదురుగా ...ఆమె..!

కలం కలల్లోంచి ...
నా కోసమే మేలుకుంటుందేమో...!

ఎక్కడిదో.. ఈ వంపుల.. వైఖరి...
తీరే .. ఝరీ...!

ఎంచేస్తోందో మరి ..?
బంధిచేస్తోంది మరీ..!

విడుదలే వద్దనేలా ...
ధ్యాస నన్ను.. దాటుతుంటే.. కొత్త .. కొత్త గా....!

Tuesday, January 27, 2009

చిత్రం.. !

ఆలోచనల తెరలపై..
వేసి చూస్తున్నా... నా సొంత చలన చిత్రం..

ఎపుడో మొదలైంది.. ఏళ్ళ క్రితం
ఒంటరి గా నా ప్రయాణం...
నన్ను ...నేను.. వెతుక్కునే ప్రయత్నం...

సంవత్సరాల.. అన్వేషణ..
సమస్తం...!
భావోద్వేగాల భాగవతం...

చాలనిపించి ఎత్తిన ..
అవతారాల ప్రస్థానం ..
అలసి చేరుకున్నా..
మది విశ్రాంతి మందిరం..

అప్పుడు తెరుచు కున్నాయి...
అంతః చక్షువులు ..
ఆశ్చర్యం!

ఇదే.. నా మానస తీరం...
నేనిక్కడే.. ఉన్నాను..
నాలోనే ఉన్నాను..
కేవలం..!
మరచి పోయాను.....! నే వేరుగా లేనని..!

Friday, January 16, 2009

ప్రేమ జీవితం... జీవితంలో ప్రేమ... ఇదో కోణం ...?

నేను చాలా మందిని (కేవలం పరిచయస్తులనే) ... అడిగి చూసాను. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం (కొత్త విషయం కాదనుకోండి అయినా...) . డబ్బు, అవకాశం, చదువు, ఉద్యోగం... ఇలా వేరు వేరు వ్యత్యాసాలు వున్నా ... అందరిలోనూ ప్రేమ కోసం తపన (మనలో మన మాట పడి చస్తున్నారు అనుకోండి...) ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోండి.. నేను రాసేది సార్వత్రిక ప్రేమ గురించి... కేవలం ఒక ఆడ - మగా అనే ఉద్దేశంతో మాత్రం కాదు..

అందులో కొన్ని విషయాలు... ఇలా వున్నాయి...
 1. నాకెవ్వరూ దొరకరా?
 2. ముందైతే బాగుండేది .. ఇప్పుడేమో ఇలాగా...
 3. నన్ను అర్ధం చేసుకోరు...
 4. ఇప్పుడు రోజులు అలా గడిచి పోతున్నై..
 5. ఇంత ఆనందం వస్తుందని .. కల్లో కూడా అనుకోలేదు..
 6. గౌరవం లేదు నాకు ఇంట్లో..
 7. ఎంతలేసి మాటలు ... బొత్తిగా లెక్క లేకుండా పోతోంది... అసలు లేకుండా పోఇనా బావున్ను ...
 8. నాకోసం నేను మా కుటుంబం.. ఇంకా...
 9. ఒంటరి గానే మిగిలిపోతానేమో ...?
 10. అసలు ఇది కాదు నేను అనుకుంది..
 11. నా బలం అంతా నా వాళ్ళే...
 12. ఆరోజుల్లో అలాగా ... రోజుల్లో ఇలాగా...
 13. ఇదో గుది బండ.. వదలలేను.. అది నన్ను వదలదు..
 14. చూడ్డానికి మేమిద్దరం చిలక గోరింకల్లా లేమూ????
 15. అంత మాత్రానికి ... నేనే ఎందుకు కావాలనుకోవడం...
 16. ఏం కావాలో తెలీదు.. చెప్పదు.. నస.. ఒకటే నస..

ఇలా బోలెడు.. చెప్పుకుంటూ పోతే... కుప్పలు.. వీటన్నిటికీ కారణం ఏంటి...? ఎందుకిలా..? ఇదే నా ప్రశ్న...

కింది సమాధానాలు చూడండి... కొన్ని..

౧. అప్పుడే ఎందుకు తొందర.. తెలుస్తుందిలే..
౨. ఈ కోపాలు లేక పోతే అందమే లేదు...
౩. ప్రేమ అన్న తరువాత ఉగాది పచ్చడి లాగ ఉండాలి..
౪. నీకింకా అంత వయసు రాలేదు..
౫. ఎక్కువ ఆలోచించకు వెంట్రుకలు రాలిపోతాయి..
౬. నిజానికి తనకి నేనంటే చాల ప్రేమ.. ఏదో అప్పుడప్పుడూ ఇలా..
౭. అన్ని విషయాలూ నీకు చెప్పక్కర్లేదు...
౮. నీకు "పెనం" ఇంకా "పొయ్యి" కధ తెలుసా?
౯. అన్నిటికీ కాలమే పరిష్కారం చెపుతుంది...

ఇప్పుడు నా కోణం లో కి వచ్చి మాట్లాడతాను. ప్రేమ లేని మనిషి లేడు, కోరిక లేని మనిషి బ్రతకలేడు.. అసలు ప్రేమ అంటే ఇవ్వడం అని అనుకుంటా (అక్కడక్కడ చదివిన విషయాలు అంతే).. మరి ఈ పైన నాకు వినపడ్డవి .. కనపడ్డవి ... అన్నీ కూడా .. ఎదురు చూపుల లాగ .. ఆశల పల్లకి లాగా.. అనిపిస్తున్నై.. అయితే నేనూ ఈ పల్లకి ఎక్కిన వాడినే.. మోసిన వాడినే .. మినహాయింపు కాదు .. మరి నా తపన అంతా ఒకటే ... ఆశించకుండా ఏమి చేయలేమా అని.. అప్పుడు భంగపాటూ ఉండదు ... భాధా ఉండదు.. ఇప్పుడే గుర్తొచ్చింది .. గీత లో కృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్పినట్టున్నాడు .. కర్మలనచరించుట యందె కాని వాటి ఫలితములసించుట యందు నీకు అధికారము లేదు . ..