Tuesday, December 23, 2008

నేనో గురివింద గింజ

అందరికి నమస్కారం,
నా పేరు, శివ రామ కుమార కృష్ణమాచార్య. నేనో గురివింద గింజని అని నా ఫీలింగ్.
కధలు, కవితలు, కబుర్లు, సినిమాలు, సంగీతం ఇంకా తెలుగు భాష ఇవన్నీ నా పిచ్చి. వీటితో పాటు నాకింకో పిచ్చి కూడా ఉంది. అదే మా ఊరు భద్రాచలం. నాకు సిటీలో కూడా సైకిల్ తొక్కడం, వర్షం లో వీధిలోకి పోవడం. ఎప్పుడూ ఆలోచనలో ఉండడం చాల ఇష్టం. నా పిచ్చిని పదిమంది తో పంచుకుందామని బ్లాగ్ తాయారు చేశాను. బ్లాగులో నా ఆలోచనలు , అనుభవాలు ఇంకా అనుభూతులు remix (కలిపి కొట్టు కావేటి రంగ) అవ్వబోతున్నై, చిన్న చిన్న కథలు, కవితలు, పారడీలు కొన్ని రాస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలూ , సలహాలు మరియు సూచనలు తెలియజేయండి.

ప్రస్తుతానికి ఉంటాను! ప్రేమలో
శివ. చెరువు